
విక్టరీ వెంకటేశ్..తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎన్నో ప్రయోగాలు.. అనేక జానర్లలో సినిమాలు చేసి.. ఎంతోమంది అందమైన హీరోయిన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరో. మాస్ అయినా.. క్లాస్ అయినా అన్నింటిల్లోనూ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. ముఖ్యంగా వెంకీ కామెడీ టైమింగ్‌కు ప్రత్యక అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించిన వెంకీ..ఇప్పుడు సంక్రాంతి కానుకగా తన 75వ సినిమాతో రాబోతున్నారు. హిట్ 1, 2 చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ నటిస్తోన్న సినిమా సైంధవ్. తన కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రిలీజ్ కాబోతుంది. వెంకీ 75 సినిమాల జర్నీ సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమాన్ని పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి దగ్గరుండి చూసుకున్నారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్, యంగ్ హీరోస్, ఇప్పటివరకు వెంకీతో కలిసి నటించిన నటీనటులు, దర్శకనిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన స్టార్ హీరోలను ఒకే వేదికపై చూసి సంతోషించారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఎప్పటికప్పుడు తాను సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్దామని అనుకున్నాని.. చిరంజీవి గ్యాప్ ఇచ్చిన ఖైదీ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం చూసి ఆ ఆలోచన మానుకున్నానని అన్నారు. అలాగే తన తోటి హీరోలు నాగార్జున, బాలయ్య హిట్స్ అందుకోవడం చూసి తనలోనూ ఉత్సాహం వచ్చిందన్నారు వెంకీ.
“మా గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి, విశ్వనాథ్ గారి లాంటి అగ్ర దర్శకులతో పనిచేసే అదృష్టం దక్కింది. అభిమానులు ఇచ్చిన ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. విక్టరీ, రాజా, పెళ్లి కానీ ప్రసాద్, పెద్దోడు, వెంకీమామ.. ఇలా ఎన్నో పేర్లతో నన్ను పిలుచుకున్నారు. పిలుపులు మారినా అభిమానుల ప్రేమ మాత్రం మారలేదు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చాను. చాలాసార్లు సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ చిరంజీవి గారు 9 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వచ్చి ఖైదీ నంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం చూశాను. దీంతో ఈ నటన ఇంకా కొనసాగాలను తెలుసుకున్నాను. నా తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్లు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు చేసుకుంటున్నాను” అని అన్నారు.
చిరంజీవి గారు @KChiruTweets లేకుంటే సినిమాలు మానేసి నేను హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని
9 సంవత్సరాల విరామం నుండి తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150తో బ్లాక్‌బస్టర్‌ను అందించడం చూసి, ఈ నటన కొనసాగాలని నేను తెలుసుకున్నాను🔥🔥🔥 – @VenkyMama Garu At #Venky75 Event ♥️#CelebratingVenky75 pic.twitter.com/bto9Lg1TEJ
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) December 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.