
ప్రస్తుతం రిమేక్ సినిమాలదే హవా నడుస్తోంది. ఇతర భాషల నుంచి తెలుగులో రిమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. గతంలో మలయాళం మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం మూవీని అదే పేరుతో తెలుగులో రిమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడుడ హీరో వెంకటేష్. ఇందులో సీనియర్ హీరోయిన్ మీనా… వెంకీకి జోడీగా నటించింది. మూవీ రిమేక్ అయిన తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా దృశ్యం 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడా జీతి జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల మలయాళం తెరకెక్కిన ఈ మూవీ సీక్వెల్ ఓటీటీలో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పుడు తెలుగులో దృశ్యం 2 పేరుతోనే ఈ సినిమా రిమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల పై ఇప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లెటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేస్తారని చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. దీంతో వెంకీ మరోసారి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వెంకీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అనివార్య కారణాల వలన ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలను వాయిదా వేశారు. అసౌకర్యానికి చింతిస్తున్నాము.. అంటూ చిత్రయూనిట్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. మళ్లీ ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ప్రకటించలేదు.
ట్వీట్..
ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్టుగా తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.
ట్వీట్..