Hari Hara Veera Mallu: ‘వీరమల్లు మాట వినాలి’ .. హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న సినిమా హరి హర వీర మల్లు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, గింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Hari Hara Veera Mallu: వీరమల్లు మాట వినాలి .. హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ వచ్చేసింది
Hari Hara Veera Mallu Movie

Updated on: Jan 17, 2025 | 11:24 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో హరిహరవీరమల్లు కూడా ఒకటి. మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. తాజాగా హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్‌ సాంగ్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ‘వీరమల్లు మాట చెబితే వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ఆలపించడం విశేషం. లిరికల్‌ సాంగ్‌లో పవన్‌ కల్యాణ్‌ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక మాట వినాలి పాటకు పెంచల్‌దాస్‌ సాహిత్యం అందించారు. ఇది వరకే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

హరి హర వీరమల్లు సినిమా మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. తొలి భాగం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు-1 ది స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తారలు నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 హరి హర వీర మల్లు సెట్ లో పవన్ కల్యాణ్..

మాట వినాలి సాంగ్ లిరికల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.