Varun Tej: వైరల్ అవుతోన్న వరుణ్ తేజ్ మూవీ స్టిల్స్.. ‘గాండీవధారి’ అర్జున సెట్స్ నుంచి..

గరుడ వేగ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రవీణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై అంచనాలు అప్పుడే పీక్‌కి చేరాయి.

Varun Tej: వైరల్ అవుతోన్న వరుణ్ తేజ్ మూవీ స్టిల్స్.. గాండీవధారి అర్జున సెట్స్ నుంచి..
Varun Tej

Updated on: Feb 12, 2023 | 10:07 AM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీటీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా. గరుడ వేగ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రవీణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై అంచనాలు అప్పుడే పీక్‌కి చేరాయి. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. అయితే ఈ మద్యే వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌తో పాటు వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. లండన్‌ బ్రిడ్జ్‌పై యాక్షన్‌ సన్నివేశానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ యూకేలో జరిగింది. అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిత్రయానిట్. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘సాక్షి వైద్య’ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.