మెగా ఇంట త్వరలోనే పెళ్లి బజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నటుడు నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇక ఇప్పుడు పెళ్లి పనులు షూరు అయినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ అంటూ చిరు కొన్ని ఫోటోస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. తన నివాసంలో నూతన జంటకు స్పెషల్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా నివాసంలో పెళ్లి సంబంరాలు స్టార్ట్ అయ్యాయి. మరోవైపు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య శుభలేఖ వీడియో తెగ వైరలవుతుంది. ఆ వెడ్డింగ్ కార్డులో వరుణ్ తేజ్ నానమ్మ.. తాతయ్య పేర్లతోపాటు పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేర్లను ముద్రించినట్లుగా తెలుస్తోంది.
అక్టోబర్ 30 నుంచి వీరి పెళ్లి వేడుక స్టార్ట్ కాబోతుంది. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్, లావణ్య కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన ఇటలీలోనే ఉండి పెళ్లి పనులు చూసుకుంటున్నారు.ఈ శుక్రవారం మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులు ఇటలీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబర్ 30న కాక్ టేల్ పార్టీతో స్టార్ట్ చేసి అక్టోబర్ 31న హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితుల కోసం నవంబర్ 5న హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వేదికగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ వీరి వివాహానికి హజరవుతారా ?.. లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
#VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family.
The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/b3z1FV9umF
— Team VarunTej (@TeamVarunTej) October 26, 2023
వరుణ్, లావణ్య ఇద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే తన ప్రేమ విషయాన్ని ముందు వరుణ్ ప్రపోజ్ చేసినట్లు గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
About Last evening ..
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.