విశాల్.. దిగజారిపోయావ్- వరలక్ష్మి

చెన్నై: 2019 నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామి శంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి శరత్‌ కుమార్‌పై విశాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని నటి వరలక్ష్మి సోషల్‌మీడియాలో మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికలతో సంబంధంలేని నా తండ్రిని ఎందుకు విమర్శిస్తావ్ అంటూ ప్రశ్నించారు. ‘ఒకవేళ నా తండ్రి తప్పు చేసి ఉంటే […]

విశాల్.. దిగజారిపోయావ్- వరలక్ష్మి

Updated on: Jun 14, 2019 | 5:02 PM

చెన్నై: 2019 నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామి శంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి శరత్‌ కుమార్‌పై విశాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని నటి వరలక్ష్మి సోషల్‌మీడియాలో మండిపడ్డారు.

ప్రస్తుత ఎన్నికలతో సంబంధంలేని నా తండ్రిని ఎందుకు విమర్శిస్తావ్ అంటూ ప్రశ్నించారు. ‘ఒకవేళ నా తండ్రి తప్పు చేసి ఉంటే చట్టం శిక్షించేది.  ప్రచారంలో నువ్వు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే అవి చెప్పు.  చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్.  నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది కాబోలు.  ఇన్నాళ్లుగా స్నేహితురాలిగా నీకు మద్దతిచ్చాను.  ఇకపై నా మద్దతు నీకుండదు.  నువ్వు నా ఓటును కోల్పోయావ్’ అంటూ విరుచుకుపడ్డారు.

Follow Us