Veera Simha Reddy: బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఇదేనా..

|

Dec 30, 2022 | 5:50 PM

ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోప్‌చంద్ మలినేని ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.

Veera Simha Reddy: బాలయ్య వీరసింహారెడ్డి  సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఇదేనా..
Varalakshmi Sarathkumar
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోప్‌చంద్ మలినేని ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టింది వరలక్ష్మీ. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందా అని అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుందట. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ బాల‌య్య కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుందట. వీరిద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. సెంటింమెంట్ సీన్లు కంటిత‌డి పెట్టించేలా ఉంటాయని టాక్. ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఈ సీన్స్ ను డిజైన్ చేశారట డైరెక్టర్.

ఇక వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దునియా విజయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి