కుర్రహీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన లైనప్ చేసిన సినిమాలు అభిమానులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా పై ఆశలు పెంచుకున్నారు చిరు ఫ్యాన్స్. ఈ సారి మెగాస్టార్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని గట్టిగానే చెప్తున్నారు. ఈ క్రమంలోనే నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీని అనౌన్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనౌన్స్ చేశారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వశిష్ఠకు సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను శోషొల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుపనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.