రెండు భాగాలుగా మెగా మేన‌ల్లుడి ‘ఉప్పెన‌’..!

మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' అనే సినిమా తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌నా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

రెండు భాగాలుగా మెగా మేన‌ల్లుడి ‘ఉప్పెన‌’..!

Updated on: Aug 30, 2020 | 12:55 PM

మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ అనే సినిమా తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌నా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. క్రితిశెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఓటీటీలోనే మూవీ రిలీజ్ చెయ్యాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఒక‌వేళ ఓటీటీలో రిలీజ్ ఫిక్స్ అయితే ఎడిటింగ్ లేకుండా రెండు పార్ట్‌లుగా మూవీ రిలీజ్ చెయ్యాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు

Follow Us