Buchi Babu Sana : ప్రేమకథల స్పెషలిస్టుగా మారిన బుచ్చిబాబు.. ‘ఉప్పెన’లా ఎగిసిపడుతున్న ఆఫర్లు..

|

Feb 17, 2021 | 5:05 PM

మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ఉప్పెన ఈ సినిమా ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

Buchi Babu Sana : ప్రేమకథల స్పెషలిస్టుగా మారిన బుచ్చిబాబు.. ఉప్పెనలా ఎగిసిపడుతున్న ఆఫర్లు..
Follow us on

Buchi Babu Sana : మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ఉప్పెన ఈ సినిమా ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు.. మొదటి సినిమానే అయినా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల చేత, సినీ పెద్దల చేస్తా శబాష్ అనిపించుకున్నాడు.

ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో 30 కోట్లకి పైగా షేర్ ను .. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కథాకథనాలను ఆసక్తికరంగా నడిపించడంలో .. పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు బుచ్చిబాబు కనబరిచిన ప్రతిభను  అందరు కొనియాడుతున్నారు. ఇక ఈ దర్శకుడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట… అందమైన లవ్ స్టోరీస్ చేయమని చాలా మంది బుచ్చిబాబుని అప్రోచ్ అవుతున్నారట. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున ఉప్పెన సినిమా చూసి ఎంతో ఇంప్రస్ అయ్యారట. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కోసం ఒక బ్యూటీఫుల్ ప్రేమ కథను సిద్ధంచేయమన్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలా కనిపించడం లేదు.. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chief Guest Jr NTR: కరోనా కూడా వాక్సిన్ ఉంది కానీ ఇలాంటి వాటికీ ఎలాంటి వాక్సిన్ లు లేవు : జూనియర్ ఎన్టీఆర్.