Upasana Konidela: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు.. వారికి అపోలో హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటన..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) సతీమణి గానే కాకుండా సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల (Upasana Konidela). అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌ పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు..

Upasana Konidela: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు.. వారికి అపోలో హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటన..
Upasana Konidela

Edited By:

Updated on: Jun 28, 2022 | 7:38 AM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) సతీమణి గానే కాకుండా సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల (Upasana Konidela). అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌ పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో ముందుంటారు. జంతుప్రేమికురాలిగా ఎన్నో వందల జంతువులను సంరక్షిస్తోన్న ఆమె పర్యావరణానికి సంబంధించి ఎన్నో ఛారీటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధశ్రమాలకు తనవంతు చేయూత నందిస్తుంటారు. ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్న ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వన్యప్రాణులంటే ఎంతో మక్కువ చూపించే ఆమె ఆపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో మరో మంచి నిర్ణయం తీసుకున్నారు.

వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, జీవ రాశుల పోషణ, మూగజీవాలసంరక్షణ కోసం పని చేసే వారికి తమ అపోలో హాస్పిటల్స్ చైన్ ద్వారా ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని ఉపాసన నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం అపోలో ఫౌండేషన్, డబ్లూడబ్లూఎఫ్‌తో కలిసి పని చేయనున్నట్లు తెలిపిందీ మెగా కోడలు. ఈ మేరకు ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా అడవిలో గాయాలపాలైన ఫారెస్ట్ రేంజర్ లు, ఇతర ఫారెస్ట్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి వైద్య సేవలైనా అందించడానికి అయినా తాము  సిద్ధంగా ఉన్నామని ఇందులో పేర్కొన్నారు. ఉపాసన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఉపాసన తీసుకున్న నిర్ణయం పట్ల మెగా అభిమానులు ఖుషీగా ఫీలవుతున్నారు. ఆమె చేస్తున్న సేవలు మరువలేనివంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us