Allu Arjun-Ram Charan: అల్లు అర్జున్‏కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. టచ్ చేశారంటూ..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో విష్ చేయగా.. మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఏకంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అభినందించారు. అలాగే పుష్ప డైరెక్టర్ సుకుమార్ బన్నీని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇక శుక్రవారం బన్నీ నేరుగా హ్యాస్య బ్రహ్మా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల బన్నీకి స్పెషల్ గిఫ్ట్ గా ఒక పూల బొకేను పంపారు. దాంతోపాటు ఓ స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చారు.

Allu Arjun-Ram Charan: అల్లు అర్జున్‏కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. టచ్ చేశారంటూ..
Ram Charan, Upasana, Allu A

Updated on: Aug 26, 2023 | 3:31 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంపై అల్లు, మెగా ఫ్యామిలీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో విష్ చేయగా.. మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఏకంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అభినందించారు. అలాగే పుష్ప డైరెక్టర్ సుకుమార్ బన్నీని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇక శుక్రవారం బన్నీ నేరుగా హ్యాస్య బ్రహ్మా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల బన్నీకి స్పెషల్ గిఫ్ట్ గా ఒక పూల బొకేను పంపారు. దాంతోపాటు ఓ స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చారు.

“డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో నీకు చేరతాయి. అందుకు నీవు అర్హుడివి కూడా..” అంటూ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. థాంక్యూ సో మచ్.. టచ్ చేశారంటూ రిప్లై ఇచ్చాడు బన్నీ.

ఇవి కూడా చదవండి

Ram Charan, Upasana

ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న బన్నీకి సోషల్ మీడియా వేదికగా అందరూ విషెస్ చెప్పగా.. రామ్ చరణ్ మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా విషెస్ తెలిపారు. మై బ్రదర్ అంటూ చెర్రీ విష్ చేయగా.. థాంక్యూ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చారు బన్నీ. దీంతో మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందని వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక ఉపాసన పంపిన గిఫ్ట్ తో చరణ్, బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదని స్పష్టమైంది. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.

అలాగే బన్నీపుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.