Kalyan Chakravarthy: అప్పట్లోనే చిరంజీవితో నటించిన నందమూరి హీరో .. హఠాత్తుగా సినిమాలకు గుడ్ చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా

|

Jul 09, 2021 | 3:09 PM

Kalyan Chakravarthy: నందమూరి బాలకృష్ణ తో పాటు.. అదే జనరేషన్ లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వెండి తెరపై అడుగు పెట్టాడు. తన నటనతో తనకంటూ ఒక ఫేమ్ ను..

Kalyan Chakravarthy: అప్పట్లోనే చిరంజీవితో నటించిన నందమూరి హీరో ..  హఠాత్తుగా సినిమాలకు గుడ్ చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా
Kalyan Chakravarthi
Follow us on

Kalyan Chakravarthy: నందమూరి బాలకృష్ణ తో పాటు.. అదే జనరేషన్ లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వెండి తెరపై అడుగు పెట్టాడు. తన నటనతో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్నాడు.. అయితే హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. అంతేకాదు.. మెగా నందమూరి హీరో మల్టీస్టార్ మూవీ 1989 లోనే తెరకెక్కింది. అదే లంకేశ్వరుడు సినిమా. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి .. నందమూరి కళ్యాణ్ రామ్ లు నటించారు. చిరంజీవి చెల్లులుగా రేవతి.. ఆమె భర్తగా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఆ హీరో తలంబ్రాలు, ఇంటి దొంగ, రౌడీ బాబాయ్, దొంగ కాపురం వంటి అనేక సినిమాల్లో నటించాడు. కెరీర్ లో మంచి స్టేజ్ కు వెళ్తాడని అందరూ భావిస్తున్న సమయంలో సడెన్ గా సినిమా రంగానికి దూరమైపోయాడు. అయితే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించిన సినిమాలు టీవీ ల్లో ప్రసారమవుతున్న సమయంలో అప్పటి తరం వారికీ.. ఇతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడా అని ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కుమారుడు..

నిర్మాతగా అన్న ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాలను నిర్మించాడు త్రివిక్రమరావు నిర్మించారు. దీంతో కల్యాణ చక్రవర్తి బాల్యం నుంచి సినీ వాతావరణంలో గడవడంతో.. సహజంగానే సినిమాలపై ఆసక్తి కలిగింది కళ్యాణ్ చక్రవర్తికి. అయితే కళ్యాణ్ చక్రవర్తికి తండ్రి తో మంచి అనుబంధం ఉంది. ఆయన మాటే శాసనంగా నడుచుకునేవాడు.. దీంతో కళ్యాణ్ చక్రవర్తి సినిమాల ఎంపిక… ఆ పాత్రలో అతను చూపించాల్సిన నటన, తను అనుసరించాల్సిన టైమింగ్ అంతా తండ్రే చూసుకునేవారు. ఎవరైనా కళ్యాణ్ చక్రవర్తికి వినిపించడానికి ఆసక్తి చూపిస్తే.. తన తండ్రికి ముందుగా ఆ కథ వినిపించమని.. తండ్రి ఒకే అంటే తనకు ఒకే అని చెప్పేవాడు. కథ విని తండ్రి సరేనంటే కొడుకు సరే అనేవాడు. ఇక సినిమా షూటింగ్ విషయంలో మార్నింగ్ మేకప్ వేసుకొని వెళ్లడం, టైమ్ ప్రకారం నటించడం, టైమ్ కాగానే తిరిగి ఇంటికి రావడం. అంతగా డిసిప్లేన్ తో నడుకునే వాడట కళ్యాణ్ చక్రవర్తి. ఇక సినిమాకోసం ఒకసారి కాల్షీట్లు ఇస్తే దానికి తిరుగుండేది కాదు. చిన్న నిర్మాతలైనా, పెద్ద నిర్మాతలైనా కొడుకు విషయంలో త్రివిక్రమరావు ఒక్కటే పద్దతిని అనుసరించేవారు.

హీరో అంటే.. డ్యాన్స్ , ఫైట్స్ మాత్రమే కాదు.. అవి ఫైట్ మాస్టర్,, డ్యాన్స్ మాస్టర్ కూడా చేస్తారు.. కనుక హీరో అంటే నటన కూడా అని భావించేవారు. అదే విషయాన్నీ కొడుకు కళ్యాణ్ చక్రవర్తికి చెప్పారు. కళ్యాణ్ ముందుగా కుటుంబ కథా చిత్రాలతో దగ్గరయ్యారు. అక్షింతలు, తలంబ్రాలు, ఇంటిదొంగ, దొంగ కాపురం, మేనమామ లాంటి ఫ్యామిలీ మూవీస్ లో నటించారు. అనంతరం మాస్‌కు దగ్గరవ్వాలని ‘రౌడీ బాబాయ్‌’, ‘రుద్రరూపం’ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు కళ్యాణ్ చక్రవర్తి ‘భక్త కబీర్‌దాస్‌’లో శ్రీరాముడిగా నటించాడనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.

శ్రీరాముడిగా నటిస్తున్న సమయంలో కళ్యాణ్ రామ్ పెదనాన్నలాగే నియమ నిష్ఠలను పాటించేవాడట. ఉదయాన్నే లేచి పండగ జరుపుకున్నంత సంబరంతో, నిష్ఠగా, నియమాలతో, భక్తితో ఆ గెటప్ వేసుకొనేవాడు. అంతేకాదు.. నేను వ్యక్తిగా మా నాన్నగారంత, నటునిగా మా పెదనాన్న గారంత కావాలి.. ఆ రోజే నేను అనుకున్నది సాధించినట్లు అని కళ్యాణ్ చక్రవర్తి చెప్పేవారు.

అయితే ‘లంకేశ్వరుడు’, ‘అగ్నినక్షత్రం’ సినీ రంగం నుంచి హఠాత్తుగా దూరం అయ్యాడు. అందుకు కారణం కళ్యాణ్ చక్రవర్తి తండ్రి. సహా కొడుకు పృథ్వి. ఓ రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు హరీన్ చక్రవర్తి , కొడుకు పృథ్వి ప్రాణాలు కోల్పోయారు. అదే యాక్సిడెంట్ లో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఆ యాక్సిడెంట్ కల్యాణ్ పెద్ద షాక్. అందులో నుంచి ఆయన తేరుకోలేకపోయాడు. దీంతో నటనకు గుడ్ బై చెప్పి.. గాయపడిన తండ్రికి సేవచేస్తూ వచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా, తను మాత్రం తండ్రితో అక్కడే ఉండిపోయాడు. తండ్రి మరణించిన అనంతరం కూడా కళ్యాణ్ చక్రవర్తి చెన్నైని వదిలి పెట్టలేదు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయాడు. అయితే ఎన్టీఆర్ తండ్రి , ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ, హరికృష్ణ కొడుకు ఇలా చాలామంది యాక్సిడెంట్స్ తోనే మృతి చెందిన విషయం తెలిసిందే.

Also Read: నీ పెళ్లి జరగదంటూ వార్నింగ్ మీద వార్నింగ్ అందుకుంటున్న మోనిత.. కన్నింగ్ పనిని కనిపెట్టే పనిలో దీప