Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story : లవ్ స్టొరీ రిలీజ్ సన్నాహాల్లో శేఖర్ కమ్ముల..ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

శేకర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన అందమైన ప్రేమకథ లవ్ స్టొరీ. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Love Story : లవ్ స్టొరీ రిలీజ్ సన్నాహాల్లో శేఖర్ కమ్ముల..ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు  వచ్చేది అప్పుడేనా..
Love Story
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2021 | 3:18 PM

Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన అందమైన ప్రేమకథ లవ్ స్టొరీ. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకునాయి. అలాగే ఈ సినిమాలోని పాటలు కుడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా సారంగదరియ పాట ఒక ఊపు ఊపింది. ఇక మజిలి సినిమనుంచి తన పంథా మార్చుకున్న చైతన్య కథలను ఎంచుకునే విహయంలో జాగ్రతలు వహిస్తున్నారు. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ విజయాలను సాదిస్తున్నాడు. ఇక ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సినిమాలో చైతన్య సాయి పల్లవి తెలంగాణా యాసలో మాట్లాడనున్నారు.

కరోనా కల్లోలం తో సినిమా మూవీ థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోన ప్రభావం కాస్త తగ్గడంతో తిరిగి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకశాలు కనిపిస్తున్నాయి. దాంతో విడుదల కు సిద్దంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ కమంలోనే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా కుడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. గతంలో లవ్ స్టోరీని ఒటీటీలో విడుదల చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ వార్తలను చిత్రయునిట్ ఖండించింది.అప్పటినుంచి ఈ అందమైన ప్రేమ కథను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేయాలని చిత్రయునిట్ ఎదురుచూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయడానికి చిత్రయునిట్ సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది. చైతన్య పల్లవిల లవ్ స్టోరీని ఆగస్ట్ 6 న విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా ఖచితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయునిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Ali: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వైరల్ అవుతున్న మొదటి పోస్ట్.. ఇంతకీ ఎం పోస్ట్ చేశాడో తెలుసా..

Taapsee Pannu: తాప్సీ పెళ్లి కండిషన్లు విన్నారా ? అబ్బాయి ఎలా ఉండాలో చెప్పిన హీరోయిన్..

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..