Anirudh Ravichandar: బక్కోడే కానీ అసాధ్యుడు.. అనిరుధ్ అరుదైన రికార్డ్.. యూనివర్సల్ టీంతో టై అప్..!

ప్రస్తుతం దక్షిణాదిలోనే కాదు భారతదేశంలోనే ది మోస్ట్ బిజీయెస్ట్ అండ్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధర్ రవిచందర్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మరో అరుదైన గౌరవం అందుకున్నాడు.

Anirudh Ravichandar: బక్కోడే కానీ అసాధ్యుడు.. అనిరుధ్ అరుదైన రికార్డ్.. యూనివర్సల్ టీంతో టై అప్..!
Anirudh Ravichander

Edited By:

Updated on: Mar 17, 2026 | 7:52 PM

ఇప్పటికే తన మ్యూజిక్‌తో సంచలనాలు రేపుతున్న అనిరుధ్ రవిచందర్.. తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మ్యూజిక్ కంపెనీ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సౌత్ ఇండియా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మధ్య ఒక క్రేజీ డీల్ కుదిరింది. అనిరుధ్ ఇటీవల ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ (Albuquerque Records) పేరుతో తన సొంత ఇండిపెండెంట్ రికార్డ్ లేబుల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లేబుల్, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో చేతులు కలిపింది. ఈ స్పెషల్ పార్టనర్‌షిప్ ద్వారా పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌పై వీరు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. భవిష్యత్తులో అనిరుధ్ చేయబోయే ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో పాటు, ఎంతో మంది కొత్త ఆర్టిస్టులను కూడా ఈ లేబుల్ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నారు. ఈ సంస్థ నుంచి రాబోతున్న తొలి ప్రాజెక్ట్ అనిరుధ్ దే కావడం విశేషం.

ఏప్రిల్ మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లేబుల్ ద్వారా రాబోయే రోజుల్లో పాప్ అండ్ హిప్-హాప్ సింగర్స్‌కి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్ దొరకనుంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 15 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు ఎవరికైనా ఆదర్శంగా నిలుస్తాయి. 2012లో వచ్చిన ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుధ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు 770కి పైగా పాటలతో ఏకంగా 13 బిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించి రికార్డ్ సృష్టించాడు. స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ సొంతం చేసుకున్న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా నంబర్-1 స్థానంలో ఉన్నాడు. ‘హుకుమ్’, ‘వాతీ కమింగ్’, ‘అరబిక్ కుతు’ లాంటి గ్లోబల్ హిట్లతో పాటు ఎన్నో సినిమాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (OST) అందించి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు.

ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ వరల్డ్‌లోనూ తన మార్క్ చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ ఒప్పందం వెనుక యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాకు ఒక పెద్ద ప్లాన్ ఉంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఉన్న మ్యూజిక్ కల్చర్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఆ సంస్థ గట్టిగా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనిరుధ్ తో జట్టుకట్టింది. తన అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ ఇండిపెండెంట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమని, దానికి పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌లో ఎంతో అనుభవం ఉన్న యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సరైన భాగస్వామి అని అనిరుధ్ చెప్తున్నాడు. కొత్త తరం మ్యూజిక్ ఆర్టిస్టులను ప్రోత్సహించి వారి టాలెంట్‌ను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి చేర్చడానికి, అలాగే సౌత్ ఇండియన్ పాప్, హిప్-హాప్ రేంజ్‌ను పెంచడానికి ఈ డీల్ బాగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

భారతీయ సంగీత భవిష్యత్తు అనిరుధ్ లాంటి ప్రతిభావంతుల చేతుల్లోనే ఉందని యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చైర్మన్ & సీఈఓ దేవరాజ్ సన్యాల్ ప్రశంసించారు. డిఫరెంట్ స్టైల్‌తో మ్యూజిక్ క్రియేట్ చేసే అనిరుధ్ కొత్త ప్రయాణానికి సపోర్ట్ చేయడం తమకు గర్వకారణం అన్నారు. అలాగే, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సనుజీత్ భుజబల్ మాట్లాడుతూ.. సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా, తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను అనిరుధ్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పారు. అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ పాప్ (I-Pop), హిప్-హాప్ మ్యూజిక్‌లో రాబోయే రోజుల్లో అనిరుధ్ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఇటు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద కూడా తనదైన పట్టు చూపిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us