Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు

|

Apr 02, 2022 | 11:23 AM

Ugadi 2022 Telugu: తెలుగు వారి లోగిళ్ళు ఉగాది పండగ శోభను సంతరించుకున్నాయి. తెలుగు నూతన సంవత్సర (Telugu New Year) వేడుకలను అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని..

Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు
Celebraties Ugadi Wishes
Follow us on

Ugadi 2022 Telugu: తెలుగు వారి లోగిళ్ళు ఉగాది పండగ శోభను సంతరించుకున్నాయి. తెలుగు నూతన సంవత్సర (Telugu New Year) వేడుకలను అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని ఈ ఏడాది అంతా శుభం జరగాలని కోరుకుంటూ ఉగాది పచ్చడి (Ugadi Pacchadi)ని తింటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు నూతన సంవత్సరం శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర శుభాకాంక్షలను సినీ నటీనటులు ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ అన్నీ శుభాలే జరగాలని మెగస్టార్ చిరంజీవి కోరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. తారక్, సాయి పల్లవి, కీర్తి సురేష్, రీతు వర్మ, మోహన్‌బాబు, శ్రీనువైట్ల, సుధీర్‌బాబు, నందమూరి కళ్యాణ్ రామ్ వంటి నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ కూడా తెలుగు సంవత్సరాదికి శుభాకాంక్షలను చెప్పారు.

శ్రీ శుభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని జూ. ఎన్టీఆర్ చెప్పారు.

ఈ తెలుగు కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలతో వెలుగులు నిండాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ చెప్పారు.

ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాని ఉగాది శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు.

ఈ అపూర్వమైన రోజు మీ, మీకుటుంబసభ్యులందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నానని మహానటి కీర్తి సురేష్ చెప్పింది.

ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని చెప్పారు నందమూరి కళ్యాణ్ రామ్

 

మహేష్ బాబు :

 

సాయి పల్లవి :

 

 

 

 

Also Read: Seedless Mango: మార్కెట్‌లో సందడి చేస్తున్న టెంక లేని మామిడి పండు.. వీడియో వైరల్

వెంకన్న ఆలయంలో ముస్లిం భక్తుల సందడి.. ఉగాదికి అల్లుడిని ఆహ్వానిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు