Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన

గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి తొలి సారిగా స్పందించారు. ముఖ్యంగా తన భార్య సంగీతతో విడాకులు, అలాగే హీరోయిన్ త్రిషతో రిలేషన్ షిప్ తదితర విషయాలపై ఆయన ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.

Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన
Vijay Divorce Case

Updated on: Mar 07, 2026 | 8:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లికి హాజరవ్వడం మరింత చర్చనీయంశమైంది. ఇక విడాకులు మంజూరు అయ్యేంత వరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ తో విజయ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ తన విడాకులపై తొలిసారి గా స్పందించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్, తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే తమిళనాడు ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇదే సందర్భంగా తన విడాకుల వ్యవహారం గురించి కూడా విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘ఇటీవల నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి బాధపడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది. ఇవి మీ సమస్యల కంటే ఎక్కువేమీ కావు. నేను హ్యాండిల్ చేసుకుంటాను. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి సారిద్దాం’ అని అభిమానులకు పిలుపునిచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు విజయ్. మహిళలకు నెలకు రూ.2,500 నగదు పంపిణీ, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆడపిల్లల పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం, తమిళనాడు అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పుట్టిన పసిబిడ్డలకు బంగారు ఉంగరం ఇస్తామని హామీ ఇచ్చారు.

మహిళలకు వరాల జల్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us