తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్

తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ లో నటించిన ఓ నటి లైంగిక వేధింపులకు గురయ్యింది. ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా అతను తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
Serial Actress

Updated on: Nov 04, 2025 | 11:59 AM

కన్నడ-తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన ప్రముఖ నటి లైంగిక వేధింపులు గురయ్యింది. గత 3 నెలలుగా నటిని వేధించిన నవీన్‌ అనే వ్యక్తి అరెస్ట్‌ చేశారు పోలీసులు. తొలుత ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టిన నవీన్‌.. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను నటి పట్టించుకోలేదు ఆ నటి.. అయినా కూడా అతను వినిపించుకోకుండా.. మెసెంజర్‌లో అసభ్య సందేశాలు, పిచ్చి పిచ్చి కామెంట్స్ పంపించాడు నవీన్‌.. దాంతో ఆమె సీరియస్ అయ్యి ఇలాంటి మెసేజ్‌లు పంపొద్దని నవీన్‌ను హెచ్చరించింది ఆ నటి. అయినా అతను వినిపించుకోకపోవడంతో ఈనెల ఒకటో తేదీన నవీన్‌ కలుసుకుని మళ్లీ హెచ్చరించింది నటి.. అయినా కూడా లైంగిక వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!

దాంతో నవీన్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతన్ని జ్యుడీషియల్‌ కస్టడీకి రిమాండ్‌ చేసింది కోర్ట్‌. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్ బుక్ లో అసభ్యకరమైన కంటెంట్‌ను పంపడం, పిచ్చి పిచ్చి వీడియోలు సెండ్ చేయడం మొద‌లుపెట్టిన‌ట్లు త‌ర్వాత‌ బ్లాక్ చేసిన అనంత‌రం కూడా న‌కిలీ ఖాతాల‌తో వేధింపులు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి