
స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రాణిస్తున్నాడు ఈ కుర్ర హీరో.. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి కలిసి రణబలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఇటీవలే హాయ్ నాన్న దర్శకుడితో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు.
అటు రష్మిక కూడా తన సినిమాలతో యమా బిజీగా ఉంది. ఈ చిన్నది పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఓ సీరియల్ హీరోయిన్ విజయ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండకు కిస్ ఇస్తాను అంటూ చెప్పి షాక్ ఇచ్చింది ఆ నటి.. ఆమె ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య అలియాస్ దీపికా రంగరాజు. ఈ చిన్నది ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
సీరియల్స్ లో సైలెంట్ పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ సందడి గా ఉంటుంది దీపికా.. కాగా దీపికా ఓ షోకు గెస్ట్‌గా వెళ్లింది.ఈ షోలో ఆమె మాట్లాడుతూ తనకు నాగార్జున, విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండతో కిస్ సీన్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా అనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా.. విజయ్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే కిస్ చేస్తాను అంటూ సరదగా చెప్పుకొచ్చింది. రష్మిక కంటే తానే బాగా కిస్ చేస్తాను అని దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.