ఇండస్ట్రీలో మరో విషాదం.. ఒక్కరోజు వ్యవధిలో అక్కా చెల్లెలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

ఇటీవల బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రాంక్ చేసి అందరిని ఫుల్స్ చేసిన విషయం తెలిసిందే. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహనా కపిలించేందుకే తాను అలా చేశానని తేలింది. ఆమె ఉద్దేశం మంచిదే అయినా ఆమె ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అని అందరూ ఆమెను విమర్శించారు. ఆమె పై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా  ఈ గర్భాశయ క్యాన్సర్ కారణంగానే ఇప్పుడు ఓ నటి కన్నుమూసింది.

ఇండస్ట్రీలో మరో విషాదం.. ఒక్కరోజు వ్యవధిలో అక్కా చెల్లెలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Dolly Sohi

Updated on: Mar 08, 2024 | 3:00 PM

సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విషాదాలు షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది కన్నుమూశారు. తాజాగా ఓ నటి అనారోగ్యంతో మరణించింది. ఇటీవల బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రాంక్ చేసి అందరిని ఫుల్స్ చేసిన విషయం తెలిసిందే. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహనా కపిలించేందుకే తాను అలా చేశానని తేలింది. ఆమె ఉద్దేశం మంచిదే అయినా ఆమె ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అని అందరూ ఆమెను విమర్శించారు. ఆమె పై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా  ఈ గర్భాశయ క్యాన్సర్ కారణంగానే ఇప్పుడు ఓ నటి కన్నుమూసింది. బుల్లితెరపై తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి డాలీ సోహి 48 ఏళ్ల ఈ నటి క్యాన్సర్ కారణంగా మరణించింది.

దాదాపు ఆరు నెలలుగా డాలీ సోహి  గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంది. చికిత్స పొందుతూ నేడు ముంబైలోని ఆస్పత్రిలో మరణించింది డాలీ సోహి. ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరింత విషాదం ఏంటంటే ఆమె చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఆమె సోదరి కూడా మరణించింది. డాలీ సోహి సోదరి అమందీప్‌ సోహి ఈనెల 7న అనారోగ్యంతో మృతి చెందింది.

అమందీప్‌ సోహి కామెర్ల వ్యాధి (జాండిస్ )తో కన్నుమూసింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు జాండిస్ వచ్చింది. అది కాస్త ముదరడంతో ఆమె కన్నుమూసింది. ఇప్పుడు ఆమె సోదరి డాలీ సోహి క్యాన్సర్ కారణంగా కన్నుమూసింది. ఇలా అక్కా చెల్లెలు ఒక్కరోజు వ్యవధిలోనే కన్నుమూయడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. మేరీ ఆషిఖి తుమ్‌ సే హి, ఖూబ్‌ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి లాంటి సీరియల్స్ తో డాలీ సోహి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరణం పై కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

డాలీ సోహి ఇన్ స్టా గ్రామ్

డాలీ సోహి ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.