Abishan Jeevinth: 27 ఏళ్లకే హీరో కమ్ డైరెక్టర్‌గా క్రేజ్.. తండ్రయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా డైరెక్టర్

అభిషన్ జీవింత్.. గతేడాది ఏప్రిల్ ముందు వరకు ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ ఒకే ఒక్క సినిమా ఇతనిని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. 27 ఏళ్లకే మంచి స్టార్ డమ్ అందుకున్న ఇతను ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోనూ ఒక అచీవ్ మెంట్ అందుకున్నాడు.

Abishan Jeevinth: 27 ఏళ్లకే హీరో కమ్  డైరెక్టర్‌గా క్రేజ్.. తండ్రయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా డైరెక్టర్
Tourist Family director Abishan Jeevinth

Updated on: Nov 02, 2026 | 4:37 PM

జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేం. కొన్నిసార్లు చాలా తక్కువ టైంలోనే ఎవరూ కూడా ఊహించని విధంగా లైఫ్ టర్న్ అయిపోతుంటుంది. తమిళ యంగ్ హీరో, దర్శకుడు అభిషన్ జీవింత్ లైఫ్ కూడా ఇలానే మారింది. . గతేడాది ఏప్రిల్ ముందు వరకు చాలా మందికి తెలియని అభిషన్ ఇప్పుడు యువతకు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. తన ట్యాలెంట్ తో కేవలం 27 ఏళ్లకే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడీ యంగ్ హీరో అండ్ కమ్ డైరెక్టర్. స్వతహాగా యూట్యూబర్ అయిన అభిషన్ గతేడాదే మెగా ఫోన్ పట్టుకున్నాడు. డైరెక్టర్ గా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే ఓ సూపర్ హిట్ సినిమాను జనాలకు అందించాడు. అందులోనే ఒక కీలక పాత్ర కూడా చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఓటీటీలో అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. దీని తర్వాత కొద్ది రోజులకే ‘విత్ లవ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిషన్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో అనస్వర రాజన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. నటుడిగానూ అభిషన్ కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం అభిషన్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. అందులో ఏకంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే..సరిగ్గా ఏడాది క్రితమే అభిషన్ పెళ్లిపీటలెక్కాడు. గతేడాది అక్టోబర్ 31న తన చిన్ననాటి స్నేహితురాలు అఖిలని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా ప్రమోషన్ల టైంలోనే స్టేజీపైనే అఖిలకు ప్రపోజ్ చేశాడు అభిషన్. ఆ తర్వాత ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఒక బిడ్డ కు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్. అభిషన్ భార్య అఖిల తాజాగా ఓ పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని అభిషనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో కూతురితో ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘నేను తండ్రి నయ్యాను’ అని ఆనందంతో పొంగిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభిషన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురితో అభిషన్ జీవింత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us