Tollywood: అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్ల సునామి సృష్టించిన టాప్-10 మూవీస్..

కథ బాగుంటే చాలు.. ఆదరించే విషయంలో ముందు ఉంటారు తెలుగు జనాలు. భాషా బేధాలు ఉండవు.. అందులో స్టార్ క్యాస్ట్ ఉన్నారా.. లేరా అనేది కూడా చూడరు. కంటెంట్ మాత్రమే తెలుగు ఆడియెన్స్‌కు ప్రధానం. ఈ కథనంలో తక్కువ బడ్జెట్‌తో భారీ వసూళ్లు సాధించిన పది భారతీయ చిత్రాల గురించి తెలుసుకుందాం...

Tollywood: అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్ల సునామి సృష్టించిన టాప్-10 మూవీస్..
Naga Shaurya

Updated on: Jan 31, 2026 | 4:02 PM

భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించి, భారీ వసూళ్లు రాబట్టాయి. అలాంటి పది చిత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రం 1.5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, 27 కోట్ల కలెక్షన్లను సాధించింది. కన్నడ హారర్ కామెడీ ఫిల్మ్ సూ ఫ్రం సో 5.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి… 100 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన గీత గోవిందం 5 కోట్ల పెట్టుబడితో నిర్మితమై.. 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చార్లీ 777 చిత్రం 20 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని.. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. 250 కోట్ల కలెక్షన్లను అందుకుంది.

వివాదాస్పద చిత్రం ద కాశ్మీర్ ఫైల్స్ కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై… 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. సాయి పల్లవి తొలి తెలుగు చిత్రం ఫిదా 13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 90 కోట్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ టాక్సీవాలా 7 కోట్ల బడ్జెట్‌తో రాగా.. 42 కోట్లు వసూలు చేసింది. నాగశౌర్య, రష్మిక మందన చలో 3 కోట్ల బడ్జెట్‌తో 24 కోట్లు సాధించింది. తెలుగు హారర్ థ్రిల్లర్ మసూద 2 కోట్ల బడ్జెట్‌తో 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని, భారీ విజయాలను నమోదు చేశాయి.

Also Read: వివి వినాయక్ హీరోగా లాంచ్ అయిన శీనయ్య మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?