Hemachandra & Sravana Bhargavi: విడాకులపై తేల్చిసిన హేమచంద్ర కపుల్… ఫుల్ క్లారిటీతో కుండబద్దలు కొట్టేశారు..

|

Jun 29, 2022 | 3:42 PM

" నా పాటల కంటే ఎక్కువగా అనవసరం, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చేందుతోంది.. జనాలు కూడా వాటిని నమ్మి సమయం

Hemachandra & Sravana Bhargavi: విడాకులపై తేల్చిసిన హేమచంద్ర కపుల్... ఫుల్ క్లారిటీతో కుండబద్దలు కొట్టేశారు..
Hemachandra Sravana Bhargav
Follow us on

టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర (Hemachandra), శ్రావణ భార్గవి (sravana bhargavi)  విడాకులు తీసుకుబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా వీరిద్దరికీ అస్సలు పడట్లేదని..దీంతో వీరు వేరు వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు సైతం తీసుకుబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు నెటిజన్స్.. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఈ కపూల్ తమ డివోర్స్ రూమర్స్ పై స్పందించారు..

వారిద్దరి సోషల్ మీడియా ఖాతాలలో విడాకుల రూమర్లపై తమదైన శైలీలో రియాక్షన్ ఇచ్చారు.. ” నా పాటల కంటే ఎక్కువగా అనవసరం, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చేందుతోంది.. జనాలు కూడా వాటిని నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారు ” అంటూ పోస్ట్ చేశారు హేమచంద్ర. ఇక శ్రావణి భార్గవి సైతం తన ఇన్ స్టాలో ” కొద్ది రోజులుగా నా యూట్యూబ్ ఛానల్ లోని వీడియోలకు వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్ స్టా ఫాలోవర్స్ కూడా పెరిగారు. దీంతో నాకు పని పెరిగింది.. ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇది జరిగింది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు చేసిన పోస్ట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు వారు విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కుండబద్దలు కొట్టేశారు ఈ టాలీవుడ్ కపూల్.

కెరీర్ ఆరంభంలోనే హేమచంద్ర, శ్రావణ భార్గవి మంచి స్నేహితులు.. ఆ తర్వాత వీరిద్దరు 2009లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు హేమచంద్ర, శ్రావణ భార్గవి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.