
సీనియర్ దర్శకుడు సాగర్ తన సుదీర్ఘ చిత్ర పరిశ్రమ ప్రస్థానంలో ఎదురైన అనేక ఆసక్తికర సంఘటనలను, ముఖ్యంగా జబర్దస్త్ జడ్జ్, నటి ఇంద్రజ, నటుడు సుమన్‌ల గురించి తెలియని నిజాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాగర్ మాట్లాడుతూ.. అమ్మదొంగ సినిమాతో ఇంద్రజకు సినీ జీవితాన్ని ఇచ్చింది తానే అని అన్నారు.తాను దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మదొంగ సినిమా ద్వారా ఇంద్రజాకు కెరీర్ పరంగా కీలక మలుపు ఇచ్చానని దర్శకుడు సాగర్ తెలిపారు. అయితే, జగదేక వీరుడు అనే రెండో సినిమా షూటింగ్ సమయంలో ఇంద్రజ ప్రవర్తన వివాదాస్పదంగా మారిందని ఆయన అన్నారు.
జగదేక వీరుడు సినిమా షూటింగ్ మైసూరులో ప్లాన్ చేశారు. యూనిట్ అంతా ప్రయాణ ఏర్పాట్లు చేస్తుండగా, ఇంద్రజ ట్రైన్‌లో వస్తే వాంతులు అవుతాయని, కాబట్టి తాను ఫ్లైట్ లో వస్తానని చెప్పిందట. అప్పట్లో స్టార్ నటి కే.ఆర్. విజయలాంటి వారు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ట్రైన్ లో వచ్చారట.. కే.ఆర్ విజయకు సొంత విమానం ఉంది. అయినా కూడా ఆమె ట్రైన్ లో వస్తాను అని తెలిపింది. కానీ ఇంద్రజ మాత్రం తనకు ట్రైన్ జర్నీ పడదు వాంతులు అవుతాయి అని చెప్పారట.. ఆమె ప్రవర్తన సాగర్‌కు నచ్చలేదన్నారు. ఆమెకు బుద్ధి చెప్పే ఉద్దేశంతో, వారం రోజుల పాటు షూటింగ్ సెట్‌లో ఇంద్రజతో ఎవరూ మాట్లాడకూడదని డైరెక్టర్ సాగర్ చెప్పారట.
ఎవరైనా మాట్లాడితే వాంతులు చేసుకుంటుందని సరదాగా చెప్పారట. దీంతో ఇంద్రజ తీవ్ర మనస్తాపానికి గురై ఏడ్చిందని, క్షమాపణలు కూడా చెప్పిందని సాగర్ తెలిపారు. ఆ తర్వాత ఆమెను తన సినిమాలలో తీసుకోలేదని సాగర్ స్పష్టం చేశారు. అలాగే రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజ నటులతో పనిచేసిన అనుభవాలను సాగర్ పంచుకున్నారు. షూటింగ్ సమయాల్లో వీరిద్దరూ ఒకరినొకరు ఆటపట్టిస్తూ దర్శకులను ఇబ్బంది పెట్టేవారని, “నేను రెడీ, వాడు రెడీనా?” అంటూ పోటాపోటీగా వాదించేవారని సాగర్ నవ్వూతూ చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి