AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడున్న హీరోల్లో అతను ఓ కారణజన్ముడు.. అతన్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా వెలిగిపోయిన నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన, తాజాగా తన కెరీర్‌లోని ఆసక్తికర మలుపులను, ఓ స్టార్ హీరోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇప్పుడున్న హీరోల్లో అతను ఓ కారణజన్ముడు.. అతన్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి
Hero Suresh
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 4:50 PM

Share

నటుడు సురేష్ గుర్తున్నాడా.? ఒకప్పుడు స్టార్ హీరోగా సినిమాల్లో రాణించారు సుమన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాలను, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో తన అనుబంధాల గురించి వివరించారు సుమన్. ముఖ్యంగా, ఓ స్టార్ హీరోతో తన అనుభవాలను, హీరో అనే పదానికి తనదైన నిర్వచనాన్ని పంచుకున్నారు. సురేష్ తన కెరీర్‌లో కొన్ని కీలకమైన ఆఫర్లను కోల్పోవడం గురించి మాట్లాడారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం రోజాలో నటించే అవకాశం వచ్చిందని, అయితే అప్పటికే రామానాయుడు గారితో ప్రేమ విజేత సినిమాకు మాట ఇవ్వడం వల్ల ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రామానాయుడుని తన గాడ్ ఫాదర్‌గా పేర్కొంటూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే తాను ప్రాధాన్యతనిచ్చానని చెప్పారు. మణిరత్నం నాలుగు నెలల పాటు షూటింగ్‌కు అడగడం, రామానాయుడు సినిమా షెడ్యూల్స్ కుదరకపోవడం వంటి కారణాలతో రోజాను వదులుకున్నానని, అయితే ఆ నిర్ణయానికి ఎటువంటి పశ్చాత్తాపం లేదని సురేష్ స్పష్టం చేశారు.

అలాగే, తన కెరీర్ ప్రారంభంలో సీతాకోకచిలక సినిమాలో అవకాశం వచ్చినా, మరో దర్శకుడికి మాట ఇవ్వడం వల్ల దానిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో జరగాల్సింది జరుగుతుందని, రాతలో లేనిది రాదని కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని సురేష్ తెలిపారు. కోల్పోయిన అవకాశాల పట్ల కొంత బాధ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సురేష్ తన తోటి నటులతో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. నాలుగు స్తంభాల ఆట వంటి చిత్రాలలో నరేష్, అరవింద్ స్వామి, కార్తీక్, సీతారలతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. కార్తీక్‌తో తన స్నేహం గురించి మాట్లాడుతూ, కార్తీక్ ఒక అజ్ఞాతవాసిలా ఉంటాడని, తరచుగా నంబర్లు మారుస్తాడని సరదాగా తెలిపారు.

అలాగే ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలో చూసిన నటులు పెద్ద హీరోలవ్వడం చూసి ఆశ్చర్యపోతానని, తమిళ హీరో విజయ్‌ను ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడుతూ చూశానని, అప్పుడే విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌తో మీ అబ్బాయి మాకు పోటీగా వస్తున్నాడేమో అని జోక్ చేశానని, ఆ తర్వాత విజయ్ పెద్ద హీరో కావడం చూసి ఆశ్చర్యపోయానని సురేష్ పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్‌లో సమంత తండ్రి పాత్రలో కలిసి నటించిన అనుభవం గురించి సురేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, ఆయన సినిమాను అర్థం చేసుకునే తీరు, ఒక సన్నివేశంలో అందరి డైలాగ్‌లను గుర్తుంచుకునే సామర్థ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఒక కారణజన్ముడు అని, ఆయన అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి అని సురేష్ అభివర్ణించారు. ఎన్టీఆర్ అందరి పట్ల చూపించే గౌరవం, మర్యాదలు ఆదర్శప్రాయమని పేర్కొంటూ, కొందరు యువ నటులు ఒకటి రెండు విజయాలకే అహంకారంగా మారతారని, అలాంటి వారిని ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ సూచించారు.

Ntr

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us