Dj Tillu: మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న డీజే టిల్లు ?.. సీక్వెల్‏కు రంగం చేసిన మేకర్స్..

|

Jun 26, 2022 | 8:14 AM

డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటించింది..

Dj Tillu: మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న డీజే టిల్లు ?.. సీక్వెల్‏కు రంగం చేసిన మేకర్స్..
Dj Tillu
Follow us on

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు (Dj Tillu) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటించింది.. చిన్న మూవీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల సునామీ సృష్టించింది.. సిద్ధుకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా డీజే టిల్లు మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు.. ఈ మూవీకి సిక్వెల్ తీసుకురానున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి..

అయితే ఈ మూవీ సిక్వెల్ రావడానికి కాస్త ఎక్కవ సమయం పట్టేట్టుగానే తెలుస్తోంది.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం జరిగినట్లుగా ప్రొడ్యూసర్ నాగవంశీ షేర్ చేసిన లేటేస్ట్ ట్వీట్ చూస్తుంటే తెలుస్తోంది.. ఆగస్ట్ నుంచి క్రేజీ అడ్వెంచర్ స్టార్ట్ అంటూ షూటింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు… మొత్తాన్ని ఈ సినిమా సిక్వెల్ రాబోతుండడంతో అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.