Tollywood : 2022 ఆదాయంలో టాప్ 2లో నిలిచిన టాలీవుడ్.. మొదటి స్థానం ఏముందంటే

|

Apr 27, 2023 | 9:00 AM

ఒక సినిమాను బీట్ చేసేలా మరో సినిమా వస్తూనే ఉంది. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని కాసుల వర్షం కురుస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు 1000 కోట్ల మార్క్ దాటడం అంటే సాహసమనే అనేవారు. కానీ ఇప్పుడు పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్ల మార్కు ను అవలీలగా దాటేస్తున్నాయి.

Tollywood : 2022 ఆదాయంలో టాప్ 2లో నిలిచిన టాలీవుడ్.. మొదటి స్థానం ఏముందంటే
Tollywood
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తోంది. బాహుబలి సినిమాతో మొదలైన ఈ ప్రభంజనం అంతకంతకు పెరుగుతూ దూసుకుపోతోంది. ఒక సినిమాను బీట్ చేసేలా మరో సినిమా వస్తూనే ఉంది. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని కాసుల వర్షం కురుస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు 1000 కోట్ల మార్క్ దాటడం అంటే సాహసమనే అనేవారు. కానీ ఇప్పుడు పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్ల మార్కు ను అవలీలగా దాటేస్తున్నాయి. బాహుబలి నుంచి మొదలుపెట్టి..కేజీఎఫ్, పుష్ప, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలు ఈ మార్క్ ను అవలీలగా అందుకున్నాయి. ఈ క్రమంలో ఏ ఇండస్ట్రీ ఎంత ఆదాయం సంపాదించింది అనే దాని పై కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఓ సర్వే నిర్వహించింది.

ఈ సర్వే లో తమిళ్ ఇండస్ట్రీ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. తమిళ ఇండస్ట్రీ అత్యధికంగా రూ.2,950కోట్ల ఆదాయంతో టాప్ లో ఉన్నటు సర్వేలో తేలింది. అలాగే టాలీవుడ్ రూ.2,500 కోట్లు రాబట్టగా . కన్నడ రూ.1570 కోట్లు, మలయాళం రూ.816కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు సర్వే లో తేలింది.

ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగులో ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. అలాగే మహేష్ బాబు రాజమౌళి సినిమా, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్‌-కొరటాల సినిమాలు. ఇక తమిళ్ లో ‘జైలర్’, ‘ఇండియన్‌2’, ‘లియో’ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.  మరి ఈ సినిమాలు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాయో చూడాలి.