Malayala Heroes: టాలీవుడ్ హీరోయిన్లకు లక్కీ మస్కట్‌లుగా మారుతున్న మలయాళ హీరోలు

టాలీవుడ్ హీరోయిన్లకు మలయాళ హీరోలు లక్కీ మస్కట్‌లుగా మారుతున్నారు. మాలీవుడ్ స్టార్స్‌తో జోడీ కట్టిన ప్రతీ సారీ తెలుగు హీరోయిన్లకు మంచి విజయాలు దక్కుతున్నాయి.

Malayala Heroes: టాలీవుడ్ హీరోయిన్లకు లక్కీ మస్కట్‌లుగా మారుతున్న మలయాళ హీరోలు
Malayala Heros

Updated on: Mar 16, 2021 | 1:30 PM

టాలీవుడ్ హీరోయిన్లకు మలయాళ హీరోలు లక్కీ మస్కట్‌లుగా మారుతున్నారు. మాలీవుడ్ స్టార్స్‌తో జోడీ కట్టిన ప్రతీ సారీ తెలుగు హీరోయిన్లకు మంచి విజయాలు దక్కుతున్నాయి. తాజాగా శాకుంతలం సినిమా కోసం కూడా ఇలాంటి కాంబినేషన్‌నే సెట్ చేశారు మేకర్స్. తెలుగింటి కోడలు సమంతతో చార్మింగ్‌ బాయ్‌ దేవ్‌ మోహన్‌ జోడి కడుతున్నారు. ఈ కాంబినేషన్‌ మీద టాలీవుడ్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.

అనుష్క లీడ్‌ రోల్‌లో నటించిన భాగమతి సినిమాలో మలయాళ నటుడే అనుష్కకు జోడిగా నటించారు. ఆ మూవీలో అనుష్క, ఉన్ని ముకుందన్‌ల జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలోని మందార మందార సాంగ్… ఆ సాంగ్‌లో స్వీటీ, ఉన్ని ముకుందన్‌ కెమిస్ట్రీకి అప్పట్లో ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మరో అందాల భామ కీర్తి సురేష్‌కు కూడా మలయాళ హీరో బ్లాక్ బస్టర్‌ను అందించారు. మహానటి సినిమాలో మాలీవుడ్‌ టాప్ హీరో దుల్కర్ సల్మాన్‌… కీర్తితో జోడి కట్టారు. ఈ సినిమా నేషనల్‌ లెవల్‌లో సత్తా చాటటమే కాదు కీర్తి సురేష్‌కు నేషనల్ అవార్డ్‌ కూడా తెచ్చిపెట్టింది. ఇలా మలయాళ హీరోలు మన హీరోయిన్లకు లక్కీ కాంబినేషన్స్ అవుతున్నారన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. కాగా ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. అటు హీరోలతో పాటు టాలీవుడ్‌కు హీరోయిన్స్‌ కూడా కేరళ నుంచే ఎక్కువ వస్తున్నారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ వీరందరూ మలయాళ హీరోయిన్స్ అన్న విషయం తెలిసిందే.

Also Read:

MLA Kethireddy Venkatarami Reddy: మొన్నటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. ఇప్పుడు హైకమాండ్ క్లాస్..!

Black Magic: ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు.. ఆ పేపర్లలో ఏం గీశారంటే..?