V.V Vinayak: అనారోగ్యానికి గురైన వివి.వినాయక్.. అసలు విషయం చెప్పిన సోదరుడు

2002లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వినాయక్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు వినాయక్. వినాయక్ వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేశాడు. బాలయ్య బాబుతో చెన్నకేశవ రెడ్డి, యంగ్ హీరో నితిన్ తో దిల్, మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారారు.

V.V Vinayak: అనారోగ్యానికి గురైన వివి.వినాయక్.. అసలు విషయం చెప్పిన సోదరుడు
Vv Vinayak

Updated on: May 29, 2024 | 3:15 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వివి వినాయక్. 2002లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వినాయక్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు వినాయక్. వినాయక్ వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేశాడు. బాలయ్య బాబుతో చెన్నకేశవ రెడ్డి, యంగ్ హీరో నితిన్ తో దిల్, మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మెప్పించారు. అయితే ఇప్పుడు వినాయక్ కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

వినాయక్ అనారోగ్యానికి గురయ్యారని టాక్ వినిపిస్తుంది. వినాయక్ కు అనారోగ్య సమస్య ఎదురైందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ లో ఇబ్బందులు రావడంతో వినాయక్ ఇంటికే పరిమితం అయ్యారు అని టాక్ వినిపిస్తుంది. చివరిగా వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి సినిమా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇంతవరకు వివి వినాయక్ తెలుగు సినిమాను అనౌన్స్ చేయలేదు. దానికి కూడా అనారోగ్య సమస్యే కారణం అని అంటున్నారు. దాంతో వినాయక్ శారీరకంగానూ తగ్గిపోయారని అంటున్నారు. అయితే దీని పై వినాయక్ సోదరుడు క్లారిటీ ఇచ్చారు. వినాయక్ కు ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు అని గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలే అని తెలిపారు. వివి వినాయక్ అనారోగ్యం పై వస్తున్న వార్తలు నమ్మవద్దని ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. దర్శకుడిగానే కాదు హీరోగా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బయటకు రాలేదు. వివి వినాయక్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలతో టాలీవుడ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.