V. N. Aditya : టాలీవుడ్ పై పంజా విసురుతున్న కరోనా.. ప్రముఖ దర్శకుడికి పాజిటివ్

|

Jan 30, 2022 | 10:06 PM

కరోనా మహమ్మారి ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలను కూడా..

V. N. Aditya : టాలీవుడ్ పై పంజా విసురుతున్న కరోనా.. ప్రముఖ దర్శకుడికి పాజిటివ్
Vn Aditya
Follow us on

V. N. Aditya : కరోనా మహమ్మారి ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడినవిషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. టాలీవుడ్ దర్శకుడు వి. ఎన్ ఆదిత్య తాజాగా కరోనా బారిన పడ్డారు.స్వల్ప లక్షణాలతో ఆయనకు కరోనా గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాడీ పెయిన్స్, జలుబు, గొంతు నొప్పి ఉండటంతో టెస్ట్ చేయించుకున్నా కరోనా అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నా.. నన్ను కలిసిన వారందరు జాగ్రత్తగా ఉండండి, టెస్ట్ లు చేయించుకోండి అని ఫేస్ బుక్ ద్వారా తెలిపారు వి. ఎన్ ఆదిత్య.

వి ఎన్ ఆదిత్య దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.  దర్శకుడిగా మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను, బాస్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా అని తెలుసి ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు పలువురు.

మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Athulya Ravi: అందంతో అదరగొడుతున్న ‘అతుల్య రవి’.. ముగ్ధులవుతున్న కుర్రకారు.. (ఫొటోస్)