అంతా ఓకే అనుకున్న తర్వాత అతను హ్యాండ్ ఇచ్చాడు.. ఆ హీరో నాకు నో చెప్పాడు: గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో మాస్ దర్శకుల లిస్ట్ లో ముందు వరసలో ఉంటారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. గోపిచంద్ మలినేని మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టక ముందు అసిటెంట్ దర్శకుడిగా పలువురి దగ్గర పని చేశారు గోపిచంద్ మలినేని

అంతా ఓకే అనుకున్న తర్వాత అతను హ్యాండ్ ఇచ్చాడు.. ఆ హీరో నాకు నో చెప్పాడు: గోపీచంద్ మలినేని
Gopichand Malineni

Updated on: Jan 27, 2026 | 10:12 AM

టాలీవుడ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. మాస్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు గోపిచంద్ మలినేని. రవితేజ క్రాక్, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అలాగే బాలీవుడ్ లో జాట్ అనే సినిమా చేశాడు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు గోపిచంద్ మలినేని. ఇదిలా ఉంటే గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తమిళ్ స్టార్ హీరో గురించి గోపిచంద్ మలినేని సంచలన కామెంట్స్ చేశారు.

గోపిచంద్ మలినేని గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దళపతి విజయ్‌తో తన ప్రాజెక్ట్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. వీరసింహారెడ్డి తర్వాత తాను ఒక కథను సిద్ధం చేసుకుని దళపతి విజయ్‌కి చెప్పినట్లు మలినేని తెలిపారు. విజయ్ కి కథ బాగా నచ్చిందని, ఒక్క సిట్టింగ్‌లోనే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గోపిచంద్ మలినేని పేర్కొన్నారు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. విజయ్ తన చివరి తమిళ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నారని, ఈ సమయంలో తెలుగు దర్శకుడితో కాకుండా తమిళ దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందని ఆయన పక్కన ఉన్నవారు ఒత్తిడి వచ్చిందని గోపిచంద్ మలినేని వివరించారు.

వారసు ( తెలుగులో వారసుడు) సినిమా కూడా తెలుగు దర్శకుడితో (వంశీ పైడిపల్లి ) చేశారు కాబట్టి, స్టార్ హీరోలు వరుసగా తెలుగు దర్శకులతో చేయడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమైందని ఆయన అన్నారు. ఈ ఒత్తిడి కారణంగానే విజయ్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మలినేని స్పష్టం చేశారు. తెలుగు దర్శకుడిని కావడంతో విజయ్ సినిమా ఆగిపోయిందని తెలిపారు గోపీచంద్. ప్రస్తుతం గోపిచంద్ మలినేని రవితేజతో ఒక ప్రాజెక్ట్, బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..