Co-Director Satyam Death: మరో సినీ ప్రముఖుడిని మింగేసిన కరోనా… ప్రముఖ కో డైరెక్టర్ సత్యం చికిత్స పొందుతూ మృతి

Co-Director Satyam Death: గత ఏడాదిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ .. ఇప్పటివరకూ ఎందరినో బలి తీసుకుంది. సెలబ్రెటీలు, సామాన్యులు, రాజకీయ నేతలు..

Co-Director Satyam Death: మరో సినీ ప్రముఖుడిని మింగేసిన కరోనా... ప్రముఖ కో డైరెక్టర్ సత్యం చికిత్స పొందుతూ మృతి
Co Director Satyam

Updated on: Apr 17, 2021 | 2:17 PM

Co-Director Satyam Death: గత ఏడాదిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ .. ఇప్పటివరకూ ఎందరినో బలి తీసుకుంది. సెలబ్రెటీలు, సామాన్యులు, రాజకీయ నేతలు ఇలా అందరూ కోవిడ్ బాధితులుగా మారిపోయారు. కరోనా విలయం లో చిక్కుకుని తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటున్నారు. ఇక చిత్ర పరిశ్రమను కూడా ఈ వైరస్ ఓ రేంజ్ లో వణికిస్తుంది. ఏడాది నుంచి ఎందరినో సినీ ప్రముఖులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ కో డైరెక్టర్ సత్యం ను కోల్పోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఇటీవల కోవిడ్ పాజిటివ్ గా నమోదు కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ని కాపాడడం కోసం మెరుగైన చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది ప్రయత్నించినా వారి యత్నాలు సఫలం కాలేదు.. కోవిడ్ తో పోరాడి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

సత్యం టాలీవుడ్‌లో ప‌లువురు ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌నిచేశారు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్స్ వద్ద పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. సత్యం మృతితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కో డైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను అంటూ హీరోయిన్ పూజ హెగ్డే ట్వీట్ చేసింది. ఆయనతో క‌లిసి అరవింద సమేత, సాక్ష్యం, అల వైకుంఠపురములో సినిమాలు చేశాన‌ని సత్యం తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

 

 

పర్‌ ఫెక్ట్ జెంటిల్‌మన్, గొప్ప వ్యక్తి సత్యం గారు.. ఆయన మరణ వార్త బాధాకరమంటూ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ట్వీట్ చేశారు. సెట్స్‌లో ఆయ‌న ఎంతో నిబద్ధతతో పని చేస్తారని .. నటీనటులతో చాలాస్నేహసంబంధనలను కొనసాగిస్తారని .. మిస్ యూ సత్యం అంటూ ట్విట్ చేశారు థమన్.

Also Read: ఓ యువకుడు ప్రాణాపాయం కలిగించేలా బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్.. పోలీసులు శిక్ష.. ఎక్కడంటే

ప్రముఖ కమెడియన్ ‘వివేక్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ