Tollywood Buzz: థమన్ ఏం మాయ చేస్తున్నాడు.. విమర్శలతో పాటు వరుస ఛాన్సులు కూడా..!

SS Thaman: అరే.. ఏ సినిమా పోస్టర్ చూసినా కూడా థమన్ పేరే కనిపిస్తోంది. రొటీన్ పాటలు ఇస్తుంటాడు.. కాపీ కొడుతుంటాడని గిట్టని వారి నుంచి విమర్శలు వస్తున్నా కూడా థమన్ జోరు మాత్రం తగ్గట్లేదు. ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ లేదు. కానీ తాజాగా భగవంత్ కేసరితో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు థమన్. అందులో పాటలు ఎలా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరోసారి చంపేసాడంతే..

Tollywood Buzz: థమన్ ఏం మాయ చేస్తున్నాడు.. విమర్శలతో పాటు వరుస ఛాన్సులు కూడా..!
SS Thaman

Edited By: Janardhan Veluru

Updated on: Oct 27, 2023 | 1:36 PM

థమన్.. థమన్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తప్ప మరోటి కనిపించడం లేదు.. ఈయన పాటలు తప్ప మరోటి వినిపించడం లేదు. అరే ఏ సినిమా పోస్టర్ చూసినా కూడా థమన్ పేరే కనిపిస్తుందక్కడ. రొటీన్ పాటలు ఇస్తుంటాడు.. కాపీ కొడుతుంటాడని గిట్టని వారి నుంచి విమర్శలు వస్తున్నా కూడా థమన్ జోరు మాత్రం తగ్గట్లేదు. ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ లేదు. కానీ తాజాగా భగవంత్ కేసరితో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు థమన్. అందులో పాటలు ఎలా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరోసారి చంపేసాడంతే.. ముఖ్యంగా నగము సగమై అంటూ సాగే ఆర్ఆర్.. బాలయ్య సినిమా స్థాయిని అలా పెంచేసింది. అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే ఇంటర్వెల్ బ్లాక్‌కు కూడా అదిరిపోయే బ్యాంగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఈయన.

దాంతో మరోసారి థమన్ వైపు చూపులు పడుతున్నాయి. తాజాగా ఈయన చేతిలో 10 సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో తెలుగులోనే పవన్ కళ్యాణ్ ఓజి, మహేష్ బాబు గుంటూరు కారం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సహా.. మరో అరడజన్ సినిమాలు థమన్ చేతిలో ఉన్నాయి. తాజాగా నయనతార 75వ సినిమా అన్నపూర్ణతో పాటు.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా ఈయనే సంగీతం అందిస్తున్నారు. తెలుగులోకి ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నా థమన్ దూకుడు మాత్రం తగ్గట్లేదు.
ఇన్‌టైమ్‌లో ఔట్ పుట్ ఇస్తాడు.. మినిమమ్ గ్యారెంటీ పాటలు ఇస్తాడు.. ఆర్ఆర్ అదరగొడతాడు.. అన్నింటికీ మించి అందుబాటులో ఉంటాడు.. రెమ్యునరేషన్‌లో రిబేట్ ఇస్తాడు.. ఇన్ని పాజిటివ్స్ ఉంటాయి థమన్‌తో పని చేసినపుడు.

అందుకే కొన్నిసార్లు థమన్ మ్యూజిక్ ఫ్లాప్ అయినా.. కాపీ ట్యూన్స్ ఇస్తున్నాడనే మైనస్‌లు అస్సలు కనిపించడం లేదన్న టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా కొన్ని సినిమాలకు కేవలం తన ఆర్ఆర్‌తోనే రేంజ్ పెంచేస్తున్నాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ నుంచి పోటీ ఉన్నా కూడా.. థమన్ సినిమాలు థమన్‌కే వస్తున్నాయి. పైగా కొందరు దర్శకులు అయితే కేవలం థమన్‌తోనే సినిమాలు చేయాలని ఫిక్సైపోయారు. ఇవన్నీ ఆయన దూకుడు మరింత పెంచేస్తున్నాయి.