హీరో అడుగు పెట్టనున్న మరో బడా ప్రొడ్యూసర్ కొడుకు..సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారా..?

|

Feb 12, 2021 | 3:46 AM

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిర్మాతల కొడుకులు , దర్శకుల కుమారులు, హీరోల వారసులు ఇలా చాల మంది సినీ ఇండస్ట్రీలోకి...

హీరో అడుగు పెట్టనున్న మరో బడా ప్రొడ్యూసర్ కొడుకు..సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారా..?
Follow us on

Dil Raju  : సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిర్మాతల కొడుకులు , దర్శకుల కుమారులు, హీరోల వారసులు ఇలా చాల మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తాజాగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్నాడు. దిల్ రాజుతో పాటు సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించే శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవ్వడానికి సిద్ధం అయ్యాడట.

ఇప్పటికే సినిమా చిత్రీకరణ మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాహో చిత్రానికి పనిచేసిన కెమెరామెన్ మది ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. హుషారు సినిమాతో యూత్ ఫుల్ సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్న శ్రీ హర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఫస్ట్ సినిమానే బడా టెక్నీషియన్స్ తో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. ఆశిష్ రెడ్డి సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Boney Kapoor : ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజ్.. అసహనం వ్యక్తం చేసిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..