నా ఇంటి ఫంక్షన్‌కు నాగార్జున వస్తే నేను ఆయనను పంపించేశా.. షాకింగ్ విషయం చెప్పిన హేమ

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ. హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నా ఇంటి ఫంక్షన్‌కు నాగార్జున వస్తే నేను ఆయనను పంపించేశా.. షాకింగ్ విషయం చెప్పిన హేమ
Hema

Updated on: Oct 05, 2025 | 4:26 PM

అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్ ల క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ అందాల తార హేమ. దాదాపు 250కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది హేమ. అయితే సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపించింది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో హేమ ప్రెస్ మీట్స్‌తో హొరెత్తిస్తుంది. తోటీ నటీనటుల గురించి సంచలన కామెంట్స్, ఆరోపణలు చేసింది. ఇక గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో హేమ పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : ఇదేం సిరీస్‌రా అయ్యా..! సీన్ సీస్‌కు సుస్సూ పడిపోతుంది.. ఎక్కడ చూడొచ్చంటే

దీంతో పోలీసును ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో కూడా ఉన్నారు హేమ. కొన్ని రోజులకు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్‌ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఇటీవలే హేమ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : బంపర్ ఆఫర్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ.. దుల్కర్ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడు

ఇటీవలే ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన సినీ జర్నీ గురించి చెప్పింది. కెరీర్ పీక్ లో ఉండగానే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. నా భర్త చాలా రిజర్వడ్ గా ఉంటారు. సినిమాలకు, ఫంక్షన్స్ కు , ఈవెంట్స్ కు రాడు. ఉదయాన్నే లేచి టిఫిన్, లంచ్ చేసి ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లేదాన్ని.. తిరిగి వచ్చి మళ్లీ వంట చేసేదాన్ని ఇలా క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. పెళ్ళయ్యాకా నాకు ఎంజాయ్ మెంట్ లేకుండాపోయింది అని తెలిపారు హేమ. నాకు ఎవరివల్లా టార్చర్ లేదు అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడంతో షోకి వెళ్లిపోయా.. అని తెలిపింది. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్‌కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటకు పైగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నవారు ఫోటోలకు నాగార్జునగారిని ఇబ్బందిపెట్టారు. దాంతో నేనే నాగ్ సార్‌ను బ్రతిమిలాడి అక్కడి నుంచి పంపించేశా… అని చెప్పుకొచ్చారు హేమ.

ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us