Ananya Nagalla: సింపుల్‌గా సారీ చెబితే సరిపోతుందా? హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్.. ఏమైందంటే? వీడియో

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. గతేడాది అనన్య నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది.

Ananya Nagalla: సింపుల్‌గా సారీ చెబితే సరిపోతుందా? హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్.. ఏమైందంటే? వీడియో
Actress Ananya Nagalla

Updated on: Feb 14, 2025 | 8:53 PM

ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉంటోంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. గతేడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్‌ హోల్మ్స్‌, డార్లింగ్ సినిమాల్లో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న ఈ అందాల తారకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆమె అందుకు కారణమైన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల ఇండిగో విమాన సంస్థ సర్వీసులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఈ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మి ఇండిగో సంస్థ మీద మండిపడింది. సిబ్బంది కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని చవి చూపించింది. ఇప్పుడు అనన్య నాగళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ ఈవెంట్ కు వెళ్లాల్సిన ఆమె బ్యాగేజ్‌ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో ఇండిగో సిబ్బందిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

.’నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక స్పెషల్ ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. ఈ విషయంపై నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు సింపుల్‌గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్‌ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్రయాణికుడు ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతుంటారు. ఇప్పుడేమో 6 గంటల బ్యాగేజి ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం అసలు కరెక్ట్ కాదు ‘ అంటూ విమానయాన సంస్థ కస్టమర్‌ కేర్‌కు ఇచ్చిపడేసింది అనన్య.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అనన్య నాగళ్లకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

వీడియో ఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .