Viswant: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. వధువు ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్

|

Oct 21, 2024 | 8:53 AM

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన విశ్వంత్ వైజాగ్ లో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఇంజినీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ చదువుకుంటోన్న సమయంలోనే కేరింత సినిమాలో హీరోగా క్రేజీ ఆఫర్ వచ్చింది.

Viswant: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. వధువు ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్
Viswant marriage
Follow us on

టాలీవుడ్‌ యంగ్ హీరో, కేరింత ఫేమ్ విశ్వంత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ‘ ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు.కాగా ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్- భావనల నిశ్చితార్థం జరిగింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావుడి లేకుండా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సామర్ల కోటకు చెందిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమా లో విశ్వంత్ కు ఆఫర్ వచ్చింది. దీంతో ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కేరింత సినిమా సూపర్ హిట్ కావడం, విశ్వంత్ నటనకు మంచి పేరు రావడంతో ఈ నటుడికి వరుసగా అవకాశాలు వచ్చాయి.

కేరింత తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మెరిశాడు విశ్వంత్. మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, తోలు బొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ మైర్, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

విశ్వంత్, భావన ల మరికొన్ని పెళ్లి ఫొటోస్..

Viswant Family 1

 

విశ్వంత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలోనూ ఓ కీరోల్ పోషిస్తున్నాడు విశ్వంత్. అలాగే మరికొన్ని సినిమాలు కూడా అతని చేతిలో ఉన్నాయి.

విశ్వంత్ స్టైలిష్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.