Subbaraju: అందుకే లేటు వయసులో పెళ్లి.. అసలు విషయం చెప్పిన నటుడు సుబ్బరాజు

సుబ్బరాజు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆయన నటించాడు. అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ఫిట్‌నెస్ బాగా మెయింటైన్ చేస్తూ.. మంచి రోల్స్ దక్కించుకుంటున్నారు. సుబ్బరాజు యాక్సిడెంటల్‌గా ఇండస్ట్రీకి పరచయమయ్యాడు

Subbaraju: అందుకే లేటు వయసులో పెళ్లి.. అసలు విషయం చెప్పిన నటుడు సుబ్బరాజు
Subbaraju

Updated on: Jan 24, 2026 | 5:00 PM

టాలీవుడ్ లో ఎంతో మంది విలన్స్ గా నటించి మెప్పించారు. వారిలో సుబ్బరాజు ఒకరు. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు సుబ్బరాజు. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఊహించని విధంగా విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు సుబ్బరాజు. ఖడ్గం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు సుబ్బరాజు. ఖడ్గం తర్వాత ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్‌, బిందాస్, గోల్కొండ హైస్కూల్, దూకుడు, పంజా, బిజినెస్‌ మ్యాన్‌, ఎవడు, శ్రీమంతుడు, బాహుబలి 2, దువ్వాడ జగన్నాథం, గీతా గోవిందం, ఎఫ్ 2, మజిలీ, గద్దల కొండ గణేష్, అఖండ, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, శాకుంతలం, బ్రో తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

తెలుగుతో పాటు తమిళ్‌, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు. అయితే సుబ్బరాజు లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. సుమారు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని కొత్తలైఫ్ మొదలు పెట్టాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన లేటుగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఏదైనా పని చేయడానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఒక పని చేయకపోవడానికి కారణం ఉండదు అని అన్నాడు. తనకు వివాహం చేసుకోవాల్సిన అవసరం అప్పటివరకూ ఎప్పుడూ కలగలేదని తెలిపాడు.  పెళ్లి జరగడం (సామాజికంగా ఒత్తిళ్లతో) అలాగే పెళ్లి చేసుకోవడం (వ్యక్తిగత నిర్ణయం) అని సుబ్బరాజు అన్నాడు.

ప్రజలు 25-26 సంవత్సరాలు రాగానే, లేదా తల్లిదండ్రుల ఒత్తిడితో, లేదా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవడం వంటి వాటిని ఆయన నిజమైన వివాహాలు కాదని. జీవితాంతం తోడుగా ఉండే సంబంధంలో భాగస్వామికి తనను తాను అంకితం చేసుకోవడమే అసలైన వివాహమని ఆయన విశ్వసిస్తారు. తాను చూసిన అనేక వివాహాలు విఫలమవడానికి గల ప్రధాన కారణం, పెళ్లి తర్వాత భాగస్వామిపై పెట్టుకున్న అధిక అంచనాలని ఆయన పేర్కొన్నారు. “నా మొగుడు ఇలా ఉండాలి” లేదా “నా భార్య ఇలా ఉండాలి” వంటి ఊహలు నిజం కానప్పుడు వ్యతిరేకత వస్తుందని అన్నాడు సుబ్బరాజు. ఇక 2024లో సుబ్బరాజు సుమారు 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..