ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టారు.. ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. శివబాలాజీ ఎమోషనల్ కామెంట్స్

తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. కొంతమంది హీరోలుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహాయక పాత్రలు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు వారిలో శివ బాలాజీ ఒకరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శివబాలాజీ.

ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టారు.. ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. శివబాలాజీ ఎమోషనల్ కామెంట్స్
Shiva Balaji

Updated on: Jan 10, 2026 | 9:12 PM

హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోగా మారాడు నటుడు శివబాలాజీ. కెరీర్ బిగినింగ్ లో హీరోగా ఆకట్టుకున్న శివబాలాజీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. మంచి సినిమాలు పడ్డప్పటికీ ఆయన హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయారు. ఆతర్వాత సెకండ్ హీరోగా నటించారు. ముఖ్యంగా ఆర్య,  శంభో శివ శంభో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే చందమామ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు శివబాలాజీ అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే కన్నప్ప సినిమాలో కనిపించారు శివ బాలాజీ. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివబాలాజీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

వ్యాపారంలో రాణించాలని భావించినప్పటికీ, స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టాను అని తెలిపారు శివబాలాజీ. తెలుగు సినీ పరిశ్రమకు రావడం, తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం డెస్టినీ అని ఆయన అన్నారు. తమిళనాడులో పుట్టి పెరిగిన శివ బాలాజీ అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రంతో ఆయన కెమెరా ముందుకు వచ్చారు. శివబాలాజీ నటించిన మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఆతర్వాత వచ్చిన ఆర్య చిత్రం శివ బాలాజీకి టర్నింగ్ పాయింట్ అయింది. ఆర్యలో తన పాత్ర నెగటివ్ షేడ్ కలిగి ఉన్నప్పటికీ, తన కోఆర్డినేటర్ కుమార్ బాబు ఇచ్చిన సలహాతో ఒప్పుకున్నానని చెప్పారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో శివ బాలాజీకి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు లభించింది.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

ఆర్య తర్వాత సంక్రాంతి వంటి ఫ్యామిలీ సినిమాల్లో మంచి పాత్రలు లభించాయి. ఆ తర్వాత చందమామ చిత్రం ఆయనకు మరింత ప్రజాదరణను తెచ్చిపెట్టిందని అన్నారు. తన తండ్రి మొదట సినీ రంగ ప్రవేశాన్ని వ్యతిరేకించినా, తన తల్లి మద్దతు ఇచ్చారని తెలిపారు. తన మొదటి జీతం రూ. 40,000 అని, సినిమా పూర్తయ్యాక రూమ్ లేక, ఆర్థికంగా ఇబ్బందులు పడి, ఒకానొక దశలో నెల రోజుల పాటు రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఈ కష్టాలన్నీ తనకు జీవితాన్ని నేర్పాయని, సినిమా ఫ్లాప్ అయినప్పుడు సన్నిహితులు కూడా దూరం పెట్టేవారని తెలిపారు. ప్రస్తుతం కథల ప్రాధాన్యత పెరిగినందున ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని  తెలిపారు శివబాలాజీ.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.