
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కేవలం నటనతోనే కాదు సామాజిక సేవతోనూ అభిమానులను సొంతం చేసుకుంటుంటారు. సినిమాల్లో నటనపరంగా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న నటులు ఎంతో మంది ఉన్నారు. కాగా సమాజ సేవలో ముందుండే వారు చాలా తక్కువ మందే ఉంటారు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలతో పాటు సమంతతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఛారిటీల ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. అలాగే విలన్ గా నటించి మెప్పించిన సోనూసూద్ లాంటి వారు కూడా ప్రజల కోసం ఎదో ఒక సాయం చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ విలన్ తన తల్లి కోసం చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తల్లి పేరు మీద 6.5 లక్షల చెట్లతో చరిత్ర సృష్టించారు. ఇంతుకు ఆ విలన్ ఎవరు.? ఆయన చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం.!
సయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో సయాజీ షిండే విలన్ గా నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించాడు. మరాఠీలో ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన షాయాజీ షిండే ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మారఠీ, హిందీ ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఇక పోకిరి సినిమాలో సయాజీ షిండే నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనే డైలాగ్ బాగా పాపులార్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు షియాజీ షిండే.
కాగా 2016లో జరిగిన ఓ సంఘటన ఆయన జీవితంలో మలుపు తిరిగింది. అదే సమయంలో ఆయన తల్లి చనిపోయారు. కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ తన తల్లిని కాపాడుకోలేకపోయారు సయాజీ షిండే.. దాంతో ఆయన ఓ సరికొత్త ఆలోచనతో సహ్యాద్రి దేవరాయ్ పేరుతో ఓ ఉద్యమం మొదలుపెట్టారు. తన తల్లి జ్ఞాపకం నేలపై శాశ్వతంగా ఉండిపోవాలని ఆయన ఆమె తల్లి బరువుకు సరితూగే విత్తనాలను తెప్పించి మహారాష్ట్ర అంతటా నాటాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుండి ఏకంగా రెండు ట్రక్కుల నిండా మొక్కలు తెప్పించి మహారాష్ట్రలో నాటారు. ఇప్పటివరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా చెట్లను నాటారు షియాజీ షిండే. ఇప్పటికే మహారాష్ట్రలోని గ్రామంలో అనేక చెట్లను నాటి పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడుతున్నారు. ఈ ప్రకృతిలోని తన తల్లిని చూసుకుంటున్నారు సయాజీ షిండే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి