Tollywood: విడాకులు తీసుకున్నారు.. మరి ఫిజికల్ నీడ్ ఎలా..? నటుడి షాకింగ్ రిప్లై

నటుడు సంపత్ రాజ్ వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివాహం చేసుకోకపోవడం, తోడు గురించి తనదైన నిర్వచనం ఇచ్చారు. విడాకు అనంతరం శారీరక అవసరాలపై ఆయన ఇచ్చిన నిర్మొహమాటమైన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. .. ..

Tollywood: విడాకులు తీసుకున్నారు.. మరి ఫిజికల్ నీడ్ ఎలా..? నటుడి షాకింగ్ రిప్లై
Actor Sampath Raj

Updated on: Dec 18, 2025 | 3:25 PM

ప్రముఖ సౌత్ ఇండియా నటుడు సంపత్ రాజ్ తన వ్యక్తిగత జీవితం, వివాహంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. అలానే శారీరక అవసరాలపై  ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటమైన సమాధానం ఇచ్చారు. విడాకుల అనంతరం మరో వివాహం చేసుకోకపోవడం గురించి మాట్లాడుతూ, అది తన వ్యక్తిగత నిర్ణయం అని స్పష్టం చేశారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తన వయసు పెరిగిన తర్వాత తోడు లేదని బాధపడిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, సంపత్ రాజ్ అది ఆయన ప్రయాణమని, తన ప్రయాణం అలా ఉండకపోవచ్చని అన్నారు. తనకు ఇప్పటివరకు తోడు లేని లోటు అనిపించలేదని, ఒంటరిగా ఉన్నప్పటికీ తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు. గోల్ఫ్ ఆడటం, వంట చేయడం, రాయడం వంటి అనేక విషయాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని వివరించారు. తన చుట్టూ స్నేహితులు, ప్రజలు ఉన్నారని, తోడు అనేది ప్రయత్నం ద్వారా కాకుండా సహజంగా రావాలని అభిప్రాయపడ్డారు. తోడుకు తనదైన నిర్వచనాన్ని సంపత్ రాజ్ అందించారు. తోడు అంటే నిరంతరం పక్కన ఉండటం, మాట్లాడటం, వంట చేయడం, సినిమా చూడటం కాదని అన్నారు. ఒకే గదిలో మౌనంగా కూర్చున్నప్పుడు కూడా ఆ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించగలగడమే నిజమైన తోడు అని ఆయన వివరించారు. ఇద్దరికీ వారి వారి వ్యక్తిగత స్వాతంత్ర్యం, ఆలోచనలు ఉండాలని, అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పక్కన ఒకరున్నారనే భావన కలగాలని అన్నారు.

పరిశ్రమలో తనకు వచ్చిన ప్రపోజల్స్ గురించి అడిగినప్పుడు, వాటిని ఫ్రెండ్‌షిప్ ప్రపోజల్స్‌గా మాత్రమే భావించానని, వాటిని ప్రేమ లేదా సంబంధాలుగా చూడలేదని అన్నారు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లోనే ముగుస్తుందని లేదని, అది స్నేహంగా కూడా ఉండవచ్చని స్పష్టం చేశారు. శారీరక అవసరాల గురించి అడిగిన ప్రశ్నకు సంపత్ రాజ్ నిర్మొహమాటంగా స్పందించారు. “ఫిజికల్ నీడ్ ఒక మెడికల్ నీడ్. నాకు ఎప్పుడు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్‌ని సాటిస్‌ఫై చేసుకుంటాను. మీరు  సింగిల్‌గా ఉన్నారు కాబట్టి మీ లైఫ్‌లో శృంగారం లేదని అనుకోవడం తప్పు” అని తేల్చిచెప్పారు. శృంగారం అనేది చాలా వ్యక్తిగతమైన, ప్రైవేట్ విషయం అని, అది డెఫినిట్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. తన తండ్రి మిలిటరీ డాక్టర్ కావడం వల్ల తనకు ఈ విషయాలపై మాట్లాడానికి ఎప్పుడూ ఇబ్బంది లేదని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.