ప్రస్తుతం దేశమంతాటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ సందడి మొదటి కానుంది. జూన్ 2 నుండి పొట్టి వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటకే టీమిండియాతో పాటు అన్న టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ తో ముగియనుంది. అంటే త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. ఇందుకోసం బీసీసీఐ కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్లికేషన్లను గూగుల్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంచింది. దీంతో చాలామంది మాజీ క్రికెటర్లు భారత జట్టు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో అప్లికేషన్లను గూగుల్ ఫార్మ్స్ లో ఉంచడంతో బీసీసీఐ కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. చాలామంది సరదాగా కోచ్ పదవి కోసం అప్లికేషన్లను పంపిస్తున్నారు. అందులో టాలీవుడ్ హీరో కమ్ దర్శకుడు కూడా ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్. అవును టీమిండియా ప్రధాన కోచ్ పదవికి చాలామంది గూగుల్ ఫార్మ్స్ ఫిల్ చేసినట్లే..ఈ హీరో కమ్ డైరెక్టర్ కూడా అప్లై చేశాడు. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే ఆ గూగుల్ ఫార్మ్స్ ఫిల్ చేసి పంపించాక .. ‘మేము ఈ దరఖాస్ ను స్వీకరించలేం’ అంటూ బీసీసీఐ నుండి రిప్లై కూడా వచ్చింది.
‘టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు సంబంధించి ఫామ్ నింపడం సరదాగా ఉంటుందని అనుకున్నాను. ఈ ప్రకారం దరఖాస్తు చేశాను. ఏం జరిగిందో మీరే చూడండి. ఏదో ఒక రోజు నా పిల్లలకు టీమిండియా హెడ్ కోచ్ కావాలని అనుకున్నానని చెబుతాను.. కానీ’ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ
— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024
అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత పెళ్లి పుస్తకం, నేను చిన్న పిల్ల, గాలి పటం, టైగర్, శ్రీమంతుడు తదిరత సినిమాల్లో హీరోగానూ, సపోర్టింగ్ రోల్స్‌లోనూ మెప్పించాడు. ఇక 2018లో సుశాంత్ తో కలిసి చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాకు గానూ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరిలో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.