
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో రఘునాథ్ రెడ్డి కన్నుమూశారని తెలుస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.అలాగే నెగిటివ్ రోల్స్ లోనూ నటించి అలరించారు. సుమారు 370కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ్ రెడ్డి. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ బోజ్ పురి సినిమాలలో కూడా నటించి మెప్పించారు. రఘునాథ్ రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రఘునాథ్ రెడ్డి మరణ వార్త తెలిసి పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
గత కొన్ని నెలల క్రితమే రఘునాథ్ రెడ్డి కొడుకు గుండెపోటుతో మృతి చెందారు. కొడుకు మరణం తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి మానసికంగా కుంగిపోయారు.. ఎంతో మానసిక క్షోభ అనుభవించిన రఘునాథ్ రెడ్డి కూడా గుండెపోటుతో కన్నుమూశారు. నెలల వ్యవధిలోనే ఇలా కొడుకు, తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారు. శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు రఘునాథ్ రెడ్డి. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి. ఆయన మరణ వార్త తెలియడంతో పలువురు నటీనటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..