Maharshi Raghava : టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం

ప్రముఖ తెలుగు నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కాలం చేశారు.

Maharshi Raghava : టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం
Maharshi Raghava

Updated on: Feb 16, 2022 | 7:07 PM

Tollywood: ప్రముఖ తెలుగు నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం, జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. పలువురు సినీ, టీవీ ప్రముఖులు మహర్షి రాఘవ తల్లి మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.

Maharshi Raghava Mother

కాగా సీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన `మహర్షి` మూవీతో హీరోగా నటించి పాపులర్‌ అయిన రాఘవ ఆ చిత్రాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన మెప్పించారు. `జంబలకిడిపంబ`, `చిత్రం భళారే విచిత్రం`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే.. పలు సీరియల్స్‌లోనూ సైతం నటిస్తున్నారు. తల్లి మరణంలో రాఘవ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read:  కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్