ఆమె గ్రేట్ లేడీ.. ఆడంబరాలకుపోకుండా మన ఇంటి పిల్లలా ఉంటుంది.. ఆ హీరోయిన్ గురించి నటుడు బెనర్జీ

టాలీవుడ్ లో తనదైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నటుడు బెనర్జీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. విలన్ గా సహాయక పాత్రల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బెనర్జీ

ఆమె గ్రేట్ లేడీ.. ఆడంబరాలకుపోకుండా మన ఇంటి పిల్లలా ఉంటుంది.. ఆ హీరోయిన్ గురించి నటుడు బెనర్జీ
Actor Banerjee

Updated on: Jan 13, 2026 | 12:36 PM

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు నటుడు బెనర్జీ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు బెనర్జీ. కెరీర్ బిగినింగ్ లో ఆయన విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. బెనర్జీ పేరు కంటే ఆయనను చూడగానే టక్కున గుర్తుపట్టేస్తుంటారు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు బెనర్జీ. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరి సినిమాల్లోనూ నటించారు బెనర్జీ.. కాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి. బెనర్జీ ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఓ హీరోయిన్ గురించి ప్రశంసలు కురిపించారు. ఇంతకూ ఆయన చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి సౌందర్య.. బెనర్జీ సౌందర్యం గురించి మాట్లాడుతూ.. గ్రేట్ లేడీ అని అన్నారు బెనర్జీ, ఆమె నిరాడంబరత, సహజత్వం అద్భుతమని అన్నారు బెనర్జీ.  సౌందర్య ఎంత పెద్ద స్టార్‌డమ్‌ను అందుకున్నా, తన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని, ఆమె ఎప్పుడూ ఇంట్లో మనిషిలాగే ఉండేవారని పేర్కొన్నారు బెనర్జీ. సౌందర్య డ్రెస్ వేసుకునే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తన అన్నీ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉండేవని బెనర్జీ అన్నారు. ఆమె హై సొసైటీకి చెందిన అడ్వాన్స్‌డ్ లైఫ్‌ను కాకుండా, సహజత్వాన్ని ఇష్టపడేవారని చెప్పారు.

కన్నడ మూలాలు ఉన్నప్పటికీ, సౌందర్య తెలుగు భాషను చాలా త్వరగా నేర్చుకొని, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారని, తెలుగు వారికి సొంత ఇంటి పిల్లలా మారిపోయారని గుర్తుచేసుకున్నారు. సౌందర్య, సావిత్రి, వాణిశ్రీ, జయసుధ లాంటి హీరోయిన్స్ నటీమణులందరూ తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ కుటుంబ భావనను కలిగించేవారని, దాదాపు అందరూ తెలుగు వారేనని లేదా తెలుగు వాతావరణానికి అలవాటు పడినవారని అన్నారు. సౌందర్య కన్నడ అమ్మాయి అయినా, తెలుగు ఇంటి పిల్లలా అందరి మన్ననలు పొందారని బెనర్జీ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.