AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Mohan: రోజు మూడు షిఫ్ట్‌లు, ఆరు సినిమాలు చేశా.. ఆ స్టార్ హీరోయిన్స్‌తో డాన్స్‌లు చేశా..

సీనియర్ నటుడు బాబూమోహన్ తన సినీ రంగ ప్రవేశం నుండి రాజకీయ ప్రస్థానం వరకు ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు రోజుకు ఐదు, ఆరు షిఫ్టులలో పనిచేస్తూ, మూడు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ అత్యంత బిజీగా గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్లలోనే గెటప్ మార్పులు చేసుకుంటూ, సరిపడా నిద్ర కూడా లేని పరిస్థితులలో షూటింగ్‌లలో పాల్గొన్నానని వివరించారు.

Babu Mohan: రోజు మూడు షిఫ్ట్‌లు, ఆరు సినిమాలు చేశా.. ఆ స్టార్ హీరోయిన్స్‌తో డాన్స్‌లు చేశా..
Babu Mohan
Rajeev Rayala
|

Updated on: May 10, 2026 | 11:41 AM

Share

సీనియర్ నటుడు బాబూమోహన్ తన సినీ రంగం, రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను మూడు షిఫ్ట్‌లు, ఆరు సినిమాలతో చాలా బిజీగా ఉండేవారని, దానిని చూసి కొందరు అసూయపడేవారని అన్నారు. రోజుకు ఐదు, ఆరు షిఫ్టుల్లో పనిచేసేవాడినని, సరైన నిద్ర లేకుండా కుర్చీల్లోనే నిద్రపోయిన రోజులు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. పాటలు, డబ్బింగ్‌లు రాత్రుళ్లు, పగలు షూటింగ్‌లు, ప్రయాణాలతో క్షణం తీరిక లేకుండా గడిపేవాడినని వివరించారు. ఒక రోజులో రెండు గంటలు ఒక చోట, ఇంకో రెండు గంటలు మరో చోట షూటింగ్ చేసేవాడినని, లంచ్ బ్రేక్‌లో కూడా వేరే సినిమాకు వెళ్లి షూటింగ్ చేసి వచ్చేవాడినని తెలిపారు.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఒక లొకేషన్ నుండి మరో లొకేషన్‌కు వెళ్లేటప్పుడు కారులోనే మేకప్ మ్యాన్‌ల సహాయంతో గెటప్స్ మార్చుకునేవాడినని, ఆ సమయంలో కర్డ్ రైస్ తిని సిద్ధమయ్యేవాడినని పేర్కొన్నారు. “హిట్లర్” సినిమా షూటింగ్ సమయంలో, దాసరి నారాయణరావు గారు చనిపోయే సీన్ కోసం ఉదయం వరకు చిత్రీకరణలో పాల్గొన్నానని చెప్పారు. ఎస్.వి. కృష్ణారెడ్డి గారి సినిమా షూటింగ్‌లో ఉదయం 7 గంటల వరకు పనిచేసి, బ్రష్ కూడా చేయకుండా చిరంజీవి గారు, దాసరి గారు కలిసి నటించిన ఒక హాస్పిటల్ సీన్ షూటింగ్ కోసం వెళ్లిన సందర్భాన్ని వివరించారు.  తాను “సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా” వంటి చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ, దానిని ఒక సాధారణ పాత్రగానే చూశానని బాబూమోహన్ తెలిపారు.

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

అంతకుముందు హీరోయిన్లైన ఆమని, సౌందర్య, సోను వాలియా, సిల్క్ స్మిత, అల్ఫాన్సాలతో పాటలు, ఫైట్‌లు చాలా చేశానని, కాబట్టి హీరో పాత్ర కొత్తగా ఏమీ అనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాణించడం, సినిమా రంగంలో హిట్స్ ఇవ్వడం రెండూ భిన్నమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. రెండింటిలోనూ తాను నెంబర్ వన్ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు. సినిమాలో ప్రతిభతో పాటు మంచి క్యారెక్టర్ లభించాలని, దాన్ని ప్రజలకు నచ్చేలా చేయాలని చెప్పారు. రాజకీయాలు ప్రజలతో సంబంధం ఉన్న రంగమని, అక్కడ వారి సమస్యలను పరిష్కరించగలగాలని, దానికి ఓర్పు, నేర్పు అవసరమని వివరించారు. సినిమాలో డైరెక్టర్, రైటర్, కెమెరామెన్ వంటి వారి సహకారం ఉంటుందని, అవసరమైతే పది టేకులు తీసుకోవచ్చని, కానీ రాజకీయాలు ప్రత్యక్ష ప్రసారం వంటివని, అక్కడ టేకులు ఉండవని, ప్రతిదీ లైవ్‌గా ఉంటుందని బాబూమోహన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!