19ఏళ్ల క్రితం విడుదలై రూ.1000కోట్లు రాబట్టింది.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

19ఏళ్ల క్రితం విడుదలై రూ.1000కోట్లు రాబట్టింది.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే
Movie

Updated on: Jun 22, 2025 | 2:01 PM

ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలు ఓటీటీల్లో మాత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటీటీలో ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్స్, ఎమోషనల్ , థ్రిల్లర్స్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆడియన్స్. ఇక ఇప్పుడు ఓ సినిమా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా ఏకంగా రూ. 1000కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన సినిమా కాదు.. దాదాపు 19ఏళ్ల క్రితం విడుదలైంది ఈ సినిమా.. అప్పట్లోనే సంచలన విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? 19ఏళ్ల క్రితం విడుదలై నయా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1000కోట్లు వసూల్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాను పదే పదే చూస్తున్నారు ఆడియన్స్. ఆ సినిమా ఎదో కాదు హాలీవుడ్ మూవీ అపోకలిప్టో. ఈ సినిమా ఓ హిస్టారికల్ యాక్షన్-అడ్వెంచర్ సినిమా, దీనికి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మాయన్ సంస్కృతి నేపథ్యంలో, 16వ శతాబ్దం ప్రారంభంలో జరిగే కథతో చిత్రీకరిస్తుంది. ఇది యుకాటాన్ ద్వీపకల్పంలోని ఒక మాయన్ గ్రామంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

సినిమా కథ జాగ్వార్ పా అనే యువ మాయన్ వేటగాడి చుట్టూ తిరుగుతుంది. అతను తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితం గడుపుతుండగా.. ఒక రోజు మాయన్ నగరం నుంచి వచ్చిన యోధులు అతని గ్రామంపై దాడి చేస్తారు. జాగ్వార్ పా బందీఅవుతాడు. అతన్ని అతని ఫ్యామిలీని మానవ బలి కోసం మాయన్ నగరానికి తీసుకెళ్తారు.. అక్కడ అతను తన జీవితం కోసం పోరాడాల్సి వస్తుంది. తన భార్య, కొడుకును రక్షించేందుకు అతను చేసే సాహసోపేతమైన తప్పించుకునే ప్రయత్నం సినిమాకే హైలైట్. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో ఉంది. ఆమె అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా.. ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటికీ ఈ సినిమా మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి