
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ హారర్ సినిమా దూసుకుపోతుంది. ఇటీవలే విడుదలైన హాలీవుడ్ హార్ర మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకర్షించింది. అంతేకాదు రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కంజురింగ్ ఫ్రాంచైజీలోని లేటేస్ట్ మూవీ ది కంజురింగ్ : లాస్ట్ రైట్స్. సెప్టెంబర్ 5, 2025న రూ. 484 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,625 కోట్ల కలెక్షన్‌లను సాధించింది. భారతదేశంలోనే కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 72.05 కోట్లు, రూ. 82.75 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
ఈ సినిమాకు మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించగా.. కంజురింగ్ యూనివర్స్ లో తొమ్మిదవ, చివరి భాగం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ (2025).1964లో ఒక పురాతన అద్దంతో కూడిన ఒక దెయ్యాన్ని గురించి తెలుసుకోవడమే ఈ సినిమా. ఈ సినిమా ఆద్యంతం ఊహించని మలుపులు, భయపెట్టే సీన్లతో ఆద్యంతం జనాలను కట్టిపడేసింది. నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..