
చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి.. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అతడు నటించిన ఆ ఒక్క సినిమా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్. హీరోగా కేవలం 16 సినిమాల్లో నటించాడు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 31 ఏళ్ల వయసులోనే సూసైడ్ చేసుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. అతడి మరణవార్త ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మరణం తీరని లోటు. అతడు మరెవరో కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ప్రేమికుల రోజు మూవీ హీరో కునాల్ సింగ్.
సోనాలి బింద్రే కథానాయికగా నటించిన ప్రేమికుల రోజు సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. 90, 2000 ప్రారంభంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కునాల్ సింగ్.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలో జన్మించిన కునాల్ తమిళంలో పలు చిత్రాల్లో నటించాడు. 1999లో ప్రేమికుల రోజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పార్వై ఒండ్రే పోతుమే, పున్నగై దేశం వంటి చిత్రాల్లో నటించాడు.
అయితే ప్రేమికుల రోజు సినిమా తర్వాత కునాల్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించేలేదు. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత కునాల్ అసిస్టెంట్ ఎడిటర్‌గా మారి, సినిమాల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టాడు. అప్పుడే అనురాధ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు.
కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కునాల్ 2008లో ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో అతడి మరణవార్త ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. చిన్న వయసులోనే నటుడిగా మంచి గుర్తింపు, అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కునాల్ ఆత్మహత్య సినీరంగాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురిచేసింది.
Kunal Singh Movie
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..