Tollywood: ఒకప్పుడు రోడ్డుపై బ్రెడ్ ప్యాకెట్లు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరో తెలుసా?

ఈ నటుడు తెలుగుతో పాటు హిందీ, పంజాబీ భాషల్లో సినిమాలు చేశాడు. తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ అవార్డు, ఫిల్మ్ ఫేర్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఈ స్థాయికి రావడానికి ఈ నటుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అవమానాలు భరించాడు.

Tollywood: ఒకప్పుడు రోడ్డుపై బ్రెడ్ ప్యాకెట్లు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: Jul 02, 2025 | 8:29 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నవారే. పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. చిన్నప్పటి నుంచి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే మనస్తత్వం ఈ ట్యాలెంటెడ్ నటుడిది. అందుకే ఎంత కష్టమొచ్చినా తల్లిదండ్రులను ఒక్క రూపాయి అడగలేదు. అలాగనీ ఖాళీగానూ కూర్చోలేదు. చేతికి వచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఒక బ్రెడ్ ఫ్యాక్టరీలో పనికి చేరాడు. రోడ్లపై తిరుగుతూ బ్రెడ్ ప్యాకెట్లను అమ్మాడు. అలాగే పశువులకు మేత వేయడం వంటి అనేక చిన్న చిన్న పనులు చేశాడు. ఇదే సమయంలో సినిమాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ అడుగడుగునా అవమానాలు, ఛీత్కారాలే ఎదురయ్యాయి. కానీ ఏనాడు తనకు నచ్చిన జీవితంపై ఆశలు వదులుకోలేదు. ఎంతో ఓపికగా ఎదురు చూశాడు. ఫలితం.. ఇప్పుడు దేశంలోనే గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనే పవన్ మల్హోత్రా. పేరు వింటే గుర్తు పట్టకపోవచ్చు కానీ గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమా గుర్తుందా? అందులో హీరోయిన గౌరీ పండిట్ వాళ్ల తండ్రే ఈ పవన్ మల్హోత్రా.

1986లో దూరదర్శన్‌లో వచ్చిన ‘నుక్కడ్’ అనే కల్ట్-క్లాసిక్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే CID, Aahat, Lagi Tujhse Lagan, Khidki వంటి ఫేమస్ టీవీ ప్రోగ్సామ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు.ఇదే క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ కు కూడా పరిచయమయ్యాడు. పలు హిట్ సినిమాల్లో నటించాడు. పలు హిందీ సినిమాల్లో నటించిన పవన్ మల్హోత్రా 2003లో ఐతే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఐతే ఏంటి, అనుకోకుండా ఒకరోజు, ఆంధ్రుడు, అమ్మ చెప్పింది తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. బ్లాక్ ఫ్రైడే, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్, డాన్, జబ్ వి మెట్, సిటీ ఆఫ్ జీ, షైతాన్, OMG 2 వంటి సినిమాలు పవన్ మల్హోత్రాకు మంచి పేరు తీసుకువచ్చాయి.

ఇవి కూడా చదవండి

తెలుగుతో పాటు హిందీ, పంజాబీ సినిమాల్లో ఫేమస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..